It Raids in Hyderabad:హైదరాబాద్ , చెన్నై లో ఐటీ రైడ్స్ కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్ లో చిట్ ఫండ్స్ టార్గెట్ గా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు పలు చిట్ ఫండ్స్ కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. జీవన్ శక్తి, ఈ కామ్ సంస్థల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. సోమేపల్లి నాగేశ్వరీ, కృష్ణ ప్రసాద్, పూజ కృష్ణ, రమేష్ నాయుడు, ఎమ్మెల్యే మాగంటి సోదరుడు వజ్రనాథ్ తో పాటు , రఘువీర్, కోటేశ్వర్ రావు ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎల్లారెడ్డి గూడా పూజ చిట్ ఫండ్స్ కంపెనీ పై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అలాగే పూజ కృష్ణ చిట్ ఫండ్స్ కు డైరెక్టర్లు కృష్ణ ప్రసాద్, దొప్పలపుడి పూజా, సోమేపల్లి నాగ రాజేశ్వరి ఇళ్ళల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి ఏకకాలంలో 100 టీమ్స్ తో సోదాలు చేస్తున్నారు.
ఇక తమిళనాడులో కూడా ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. డీఎంకే నేత ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. డీఎంకే ఎంపీ జగత్ రక్షన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయన ఇంటితో పాటు పలు కార్యాలయాల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో డీఎంకే శ్రేణులు ఐటీ శాఖ దాడులు నిరసిస్తూ ఆందోళనకు దిగుతున్నాయి. సోదాలు జరుగుతున్న… చెన్నై, అరక్కోణం, కోయంబత్తూరు వంటి చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. జగత్ రక్షన్ డీఎంకే పార్లమెంటు సభ్యుడిగా ఉండటంతో కొంత అలజడి చేలరేగింది. మనీలాండరింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెల్లవారు ఝాము 5 గంటల నుంచే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కూకట్ పల్లి ఇందూ ఫార్ట్చ్యూన్ విల్లాలు, మూసాపేట్లో వసంతనగర్ లోనూ అధికారులు దాడులు నిర్వహించారు. ఒకే టైమ్ లో మొత్తం 40 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయని తెలుస్తోంది. 50 బస్సుల్లో వంద టీమ్‌లతో సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ కు భారీగా తరలివచ్చారు. బీఆర్ఎస్కు ఎన్నికల ఫండింగ్ అందించే అవకాశం ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, కాంట్రాక్టర్లే టార్గెట్‌గా ఐటీ దాడులు జరుగుతున్నాయని సమాచారం. చిట్‌ఫండ్ కంపెనీలు, ఫైనాన్స్ కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులే టార్గెట్‌గా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అమీర్‌పేట్, శంషాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో రైడ్స్ జరుగుతున్నాయి. శంషాబాద్‌లోని ఈకామ్ చిట్ ఫండ్స్‌లో కూడా అధికారులు రైడ్స్ నిర్వహించారు. 8 ఎకరాల్లో ఉన్న చిట్ ఫండ్ కంపెనీలో తనిఖీలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్ సంస్థ యజమాని రఘువీర్ ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
అలాగే అమీర్‌పేట్ పూజకృష్ణ చిట్ ఫండ్స్ సంస్థపై 20 టీమ్స్ ,డైరెక్టర్స్ సోంపల్లి నాగ రాజేశ్వరి, పూజలక్ష్మీ, ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్ళల్లో, కూకట్పల్లి ఇందు ఫార్చ్యూన్ విల్లాలో అరికపూడి కోటేశ్వరరావు ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలతోనే రైడ్స్ నిర్వహిస్తున్నామని ఐటీ అధికారులు చెబుతున్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన దగ్గర నుంచీ ఇక్కడ పొలిటికల్ సీన్ మొత్తం మారిపోయింది. కేంద్రంలో ప్రధాన పార్టీ అయిన బీజెపీ (BJP) రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోంది. ముఖ్యంగా తెలంగానలో బలమైన బీఆర్ఎస్ (BRS) ను దెబ్బతీయాలని స్కెచ్ వేసింది. దానిలో భాంగానే ఆ పార్టీ నేతల ఇళ్ళల్లో ఐటీ సోదాలు జరుగుతాయని ముందే ఉప్పందంది. దానికి తగ్గట్టు ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతల ఇళ్ళ మీదకు ఐటీ టీమ్ దాడులు చేస్తున్నారు. ప్రస్తుతం మాగంటి గోపీనాథ్ (BRS MLA Maganti Gopinath) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకంగా వంద బృందాలుగా ఏర్పడి ఐటీ అధికారులు సోదాలు (It Raids) చేస్తున్నట్టు సమాచారం. మాగంటి ఇంట్ఇతో పాటూ ఆయన బంధువుల ఇళ్ళల్లోనూ రైడ్స్ జరుగుతున్నాయి. వీరితో పాటూ వ్యాపార వేత్తలు ప్రసాద్, కోటేశ్వర్రావు, రఘువీర్ ఇళ్ళల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు.
Also Read: ఎన్డీయేకు గుడ్‌బై..జనసేనాని కీలక నిర్ణయం.!
ఎన్నికల సమయంలో ఫండింగ్ అనేది ఏ పార్టీకైనా కీలకం. ఆ ఫండింగే నిలిచిపోతే.. ఎన్నికల్లో నిలవడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందుకే.. బీఆర్ఎస్ ఆర్థిక వనరులపై ఎటాక్ చేయాలని బీజేపీ ప్లాన్ వేసిందని సమాచారం. ఇందులో భాగంగానే ఐటీ అధికారులను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్ల లక్ష్యంగా దాడులు చేసి బీఆర్ఎస్ పార్టీకి నిధులు అందకుండా చేయాలని భారీ ప్లాన్ వేశారని తెలుస్తోంది.
మహబూబ్‌నగర్, నిజామాబాద్ సభల్లో బీఆర్ఎస్ టార్గెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం ఉందని, వారి అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేస్తానంటూ సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడానికి తన ఆశీర్వాదం కోరారని, అందుకు తాను తిరస్కరించానని చెప్పారు. కేసీఆర్ (KCR) పాలన అంతా అవినీతిమయం అని ఆరోపించారు. ఇలా ఆరోపణలు చేసి వెళ్లారో లేదో.. అలా ఐటీ అధికారులు నగరంలోకి వాలిపోయారు.