IGNOU Admissions : ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) లో అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకునేందుకు ఇదే చివరి అవకాశం. జూలై సెషన్లో అడ్మిషన్ కోసం జూన్ 30 వరకు దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చేసుకోవచ్చు. అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, PG డిప్లొమా కోర్సులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లేదా ఓపెన్, దూరవిద్య విధానంలో చదువుకోవచ్చు. ఈ ప్రొగ్రెమ్ కింద మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్‌తో పాటు నాలుగేళ్ల డిగ్రీని అభ్యసించవచ్చు.
డిస్టెన్స్ ప్రోగ్రామ్‌లో చదువుకోవడానికి అభ్యర్థులు ముందుగా ignouadmission.samarth.edu.in కు లాగిన్ అవ్వాలి. అటు ఆన్లైన్ మోడ్ ద్వారా చదువుకోవడానికి, అభ్యర్థులు ignouiop.samarth.edu.in కి లాగిన్ అవ్వాలి. కొత్త దరఖాస్తుదారులు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలి. ఇందులో ID క్రియేట్ అయిన తర్వాతే వారు ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ఛాన్స్ ఉంటుంది. దరఖాస్తును సమర్పించేటప్పుడు అభ్యర్థులు సూచనలను జాగ్రత్తగా చదవాలి. లేదంటే దరఖాస్తును పరిగణనలోకి తీసుకోరు.
ఎలా దరఖాస్తు చేయాలి?
–> అధికారిక వెబ్సైట్ ignou.ac.in ని సందర్శించండి.
–> హోమ్‌పేజీలో ‘జూలై అడ్మిషన్ 2024’ లింక్‌ను చూడండి.
–> అభ్యర్థులకు ఆన్లైన్ లేదా ODL ప్రోగ్రామ్ లింక్‌లను పొందే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
–> ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
–> దరఖాస్తు రుసుమును చెల్లించండి.
–> ఫారమ్‌ను డౌన్లోడ్ చేసి తర్వాత ముందు జాగ్రత్తగా ప్రింట్‌అవుట్‌ని తీసుకోండి.
అవసరమైన డాక్యుమెంట్స్:
–> స్కాన్ చేసిన ఫొటో (100 KB కంటే తక్కువ)
–> స్కాన్ చేసిన సంతకం (100 KB కంటే తక్కువ)
–> సంబంధిత విద్యా అర్హత-స్కాన్ చేసిన కాపీ (200 KB కంటే తక్కువ)
–> SC/ST/OBC అయితే కేటగిరీ సర్టిఫికేట్ -స్కాన్ చేసిన కాపీ (200 KB కంటే తక్కువ)
Also Read: మోదీ గారూ సమాధానం చెప్పండి.. నీట్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్!