HRA Hike: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ తీపి కబురు అందించింది. సచివాలయం (AP Sachivalayam), హెచ్వోడీ కార్యాలయ ఉద్యోగులకు హెచ్ఆర్ఏను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న 16 శాతం హెచ్ఆర్ఏను 24శాతానికి పెంచినట్లు తెలిపింది. అయితే ఇది రూ.25 వేలకు మించకుండా వర్తింపజేయాలని ఆర్థికశాఖ కార్యదర్శి అధికారులకు సూచించారు.