Chennai : ఎక్స్ట్రా సాంబారు(Extra Sambar) అడిగితే లేదని సమాధానం చెప్పినందుకు హోటల్ సూపర్ వైజర్(Hotel Supervisor) ని చంపేశారు తండ్రికొడుకులు. ఈ ఘటన మంగళవారం రాత్రి చెన్నై(Chennai) లోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ రెస్టారెంట్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అనగపుత్తూర్ పరిగర్ కు చెందిన శంకర్ , ఆయన కుమారుడు అరుణ్ టిఫిన్ తినడానికి హోటల్ కు వెళ్లారు.
ఇడ్లీ ఆర్డర్(Idli Order) వచ్చిన తరువాత ఎక్స్ ట్రా మరో సాంబారు ప్యాకెట్ ఇవ్వాలని వారు హోటల్ సిబ్బందిని అడిగారు. దాంతో వారు ఎక్స్ ట్రా సాంబారు ప్యాకెట్ ఇవ్వలేమని చెప్పారు. దీంతో అక్కడ గొడవ జరిగింది. ఆ తరువాత కొద్ది సేపటికి అక్కడ నుంచి వారిద్దరూ వెళ్లిపోయారు. అక్కడితో వారు ఆగకుండా పార్కింగ్ ఏరియాలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో కూడా గొడవకి దిగారు.
సెక్యూరిటీతో జరుగుతున్న గొడవను చూసిన సూపర్ వైజర్ అరుణ్ గొడవ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లాడు. సెక్యూరిటీతో గొడవ ఆపాలని తండ్రి కొడుకులను కోరాడు. కానీ వారు వినకుండా అరుణ్ తల మీద, నుదురు, మెడ పై దాడి చేయడంతో అరుణ్ అక్కడికక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సెక్యూరిటీ ఈ విషయాన్ని గమనించి కేకలు వేయగా నిందితులు అక్కడ నుంచి పారిపోయారు.
ఈ విషయం గురించి తెలుసుకున్న హోటల్ సిబ్బంది సూపర్ వైజర్ ను వెంటనే జీజీహెచ్ కు తరలించగా అరుణ్ ను పరిశీలించిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు.
దీని గురించి సమాచారం అందుకున్న శంకర్ నగర్ పోలీసులు నిందితులుశంకర్, అరుణ్ కుమార్ లను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read : భారీ అగ్ని ప్రమాదం..నలుగురి మృతి!