Honeymoon Express: సూపర్ హిట్ వెబ్ సీరీస్ 30 వెడ్స్ 21 ఫేమ్ నటుడు చైతన్య రావు, హెబ్బా పటేల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘హనీమూన్ ఎక్స్ప్రెస్’. రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి బాలరాజశేఖరుని దర్శకత్వం వహించారు. జూన్ 21 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. అయితే థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ మూవీ విడుదలైన రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది.
ఓటీటీలో హనీమూన్ ఎక్స్ప్రెస్
ఆగస్టు 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రేమ, పెళ్లి, విడాకుల కాన్సెప్ట్ తో ఓటీటీ ప్రియులను ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. NRI ఎంటర్టైన్మెంట్స్, న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై KKR, బాల రాజ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో రవి వర్మ , తనికెళ్ళ భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. థియేటర్స్ లో ఈ సినిమాను మిస్ అయిన వాళ్ళు.. ఇప్పుడు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Telugu film #HoneymoonExpress (2024) by @BRajasekharuni, ft. @IamChaitanyarao @ihebahp @hasinimani @TanikellaBharni #Ali #SurekhaVani & #RaviVarma, now streaming on @PrimeVideoIN.@itsKalyaniMalik @tseriessouth pic.twitter.com/LRwpZyfP5j
— CinemaRare (@CinemaRareIN) August 27, 2024
Also Read: Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు! – Rtvlive.com