Cholesterol Health: బిజీ బిజీగా గడిచిపోయే లైఫ్ లో చాలా మంది ఆహరం పై అంతగా శ్రద్ధ పెట్టరు. కొంత మంది ఇంట్లో తినే సమయం లేక బయట జంక్ ఫుడ్, డీ ఫ్రైడ్ ఫుడ్స్ , పిజ్జా, బర్గర్ వంటి ఆహారాలు తింటారు. అదే పనిగా ఎక్కువ రోజుల పాటు వీటిని తింటే అనారోగ్య సమస్యలు తప్పవు. ముఖ్యంగా వాటిలో వాడే ఆయిల్, బట్టర్, నెయ్యి వంటి పదార్థాలు శరీరంలో కొవ్వు పెరడగానికి కారణమవుతాయి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు.. శరీరంలో అధిక కొవ్వు తగ్గించడానికి ఈ సింపుల్ డ్రింక్స్ సహాయపడతాయి.
కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ డ్రింక్స్
గ్రీన్ టీ
గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, కాటెచిన్స్ శరీరంలో చేదు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు ఈ గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీర నిర్విషీకరణకు ఉపయోగపడతాయి. ఇది మానసిక, శారీరక ఆరోగ్యం పై కూడా మంచి ప్రభావం చూపును.
ఓట్ మీల్ స్మూతీస్
ఓట్ మీల్ స్మూతీస్.. గోధుమలతో తాయారు చేసిన ఈ మిశ్రమం చాలా రకాల జీవన శైలి వ్యాధులను తగ్గించడానికి మంచి ఎంపిక. ఇది బరువు పెరడగం, రక్త పోటు, ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో గ్లూటెన్ శాతం తక్కువగా ఉండడంతో పాటు ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని సోలబుల్ ఫైబర్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాపడును.
సోయా మిల్క్
సోయా మిల్క్ రోజు తాగడం వల్ల శరీరంలో అధిక కొవ్వు, వాపు, గుండె సంబంధిత వ్యాధులను వచ్చే ప్రమాదాన్ని తగ్గించును. ఇది తక్కువ కేలరీలు, పుష్కలమైన పోషకాలను కలిగి ఉంటుంది. అంతే కాదు బరువు తగ్గడంలో కూడా సహాయపడును.
టమాటో జ్యూస్
మనం రోజు తినే ఆహారంలో టమాటో జ్యూస్ తీసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడును. టమాటో లో లైకోపిన్ అనే కాంపౌండ్ శరీరంలో అధిక కొవ్వును తగ్గించును. దీనిలో కొవ్వును తగ్గించడానికి సహాయపడే ఫైబర్, నియాసిన్ ఎక్కువగా ఉంటాయి.
Also Read: Diabetic Health: మధుమేహ సమస్య ఉన్నవాళ్లు.. ఈ పండ్లు మాత్రమే తినండి..!