Choreographer Ganesh Acharya About Pushpa 2 Songs : టాలీవుడ్ (Tollywood) మోస్ట్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ కి ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ సోషల్ మీడియా (Social Media) అంతటా ట్రెండింగ్ లో నిలిచి సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ సాంగ్ ని డిఫెరెంట్ గా మేకింగ్ రూపంలో రిలీజ్ చేశారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ లోని హుక్ స్టెప్స్ సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అయ్యాయి. ఇక ఈ సాంగ్ గురించి గణేష్ ఆచార్య (Ganesh Acharya) తాజా ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Also Read : మా అబ్బాయి పడిన కష్టాలకు దేవుడు ఫలితాన్నిచ్చాడు!
500 మంది డ్యాన్సర్లతో…
తాజా ఇంటర్వ్యూలో కొరియోగ్రాఫర్ గణేష్ మాట్లాడుతూ.. ” సూసేకి.. స్వీట్ సాంగ్. గ్రాండ్‌గా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన లిరికల్ వీడియోలో మేకింగ్ మాత్రమే చూపించాం. అసలైన డ్యాన్స్ చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఎనిమిది రోజుల్లో ఈ పాట చిత్రీకరణ పూర్తయింది. 500 మందికి పైగా డ్యాన్సర్లు పాల్గొన్నారు.
కపుల్స్ కూడా ఈజీగా డ్యాన్స్ చేయగలిగేలా హుక్ స్టెప్ ఉండాలని ముందే ఫిక్స్ అయ్యా. దానికి తగ్గట్టే కొరియోగ్రఫీ చేశా. అల్లు అర్జున్ – రష్మిక (Rashmika Mandanna) తమ డ్యాన్స్‌తో అలరిస్తారు” అని చెప్పుకొచ్చాడు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.