Electoral Bonds Details of DMK: ప్రస్తుతం దేశం అంతటా ఎలక్టోరల్ బాండ్స్ గురించే చర్చ జరగుతోంది. ప్రతీ రాష్ట్రలోని ఉన్న పార్టీలకు ఎవరెవరు ఎంతెంత విరాళాలు ఇచ్చారన్న విషయం వెలుగులోకి వస్తున్నాయి. వీటి మీద విచారణ చేస్తున్న ఈడీ. సీబీఐ ఈ వివరాలను బయటపెడుతున్నాయి. తాజాగా తమిళనాడులోని డీఎంకే పార్టీకి ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత విరాళాలు వచ్చయో తెలిపాయి. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ యాజమాన్యంలోని ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్.. 2019-20 ఇంకా 2022-23 మధ్య కాలంలో డీఎంకేకు కి రూ.509 కోట్లు అందించింది. ఇది కాక ఈ పార్టీ బాండ్ల ద్వారా 611 కోట్ల్ఉ అందుకుంది. అయితే అన్నింటికంటే డీఎంకేకు ఎక్కువగా 79 శాతం విరాళం ఇచ్చింది మాత్రం ఫ్యూచర్ గేమింగే.
ఎలక్టోరల్ బాండ్ తాజా వివరాల ప్రకారం ఈబీల ద్వారా అతి పెద్ద మొత్తంలో ఫ్యూచర్ గేమింగ్…నాలుగు విడతలగా డీఎంకేకు విరాళాలు ఇచ్చింది. అక్టోబర్ 23, 2020, అక్టోబర్ 29, 2020 మధ్య రూ. 60 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేసింది. ఆ తరువాత ఏప్రిల్ 5, 2021 జనవరి 11, 2022 మధ్య రూ. 249 కోట్లు, ఏప్రిల్ 11, 2022 మరియు అక్టోబర్ 12, 2022 మధ్య రూ. 160 కోట్లు ఇవ్వగా.. ఏప్రిల్ 20, 2023 నాటికి రూ. మరో 40 కోట్లు జమ చేసిందని చెబుతోంది.
పైన చెప్పిన మొత్తం కేవలం ఫ్యూచర్ గేమింగ్ నుంచి మాత్రమే వచ్చాయి. ఇది కాక డీఎంకే పార్టీకి ఇతర కంపెనీల నుంచి కూడా అధిక మొత్తంలో విరాళాలు అందాయి. అందులో 2019 నుంచి 2023 మధ్యలో మేఘా ఇన్ఫ్రా నుంచి 105 కో్టలు, ఇండియా సిమెంట్స్ నుంచి 14 కోట్లు, సన్ టీవీ నెట్వర్క్ నుంచి 10 కోట్లు, త్రివేణి నుంచి 8 కోట్లు, రామ్‌కో సిమెంట్స్ నుంచి 5 కోట్లు ముడుపులు అందాయి. 2019 నుంచి 2023 మధ్యలో నాలుగేళ్ళ కాలంలో డీఎంకే పార్టీకి మొత్తంగా 656.5 కోట్ల విరాళాలు వచ్చాయని ఎలక్టోరల్ బాండ్ చెబుతోంది.
అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డీఎంకే కు విరాళాలు ఇచ్చిన పార్టీలు…తాము ఎంతెంత ఇచ్చామో తెలపడానికి ముందు వచ్చాయి. అవి ఇచ్చిన వివరాల ప్రకారం సమాజ్ వాదీ పార్టీ, ఏఐఏడీఎంకే, ఎన్సీపీ, ఆప్, ఆర్జేడీ, జేడీ(యూ), గోవా ఫార్వర్డ్ పార్టీ, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఉన్నాయి. 2019లో బాండ్ల ద్వారా మొత్తం రూ.6.05 కోట్ల నిధులు ఐపీఎల్ టీమ్ ఓనర్ చెన్నై సూపర్ కింగ్స్ (రూ. 5 కోట్లు), లక్ష్మీ మెషిన్ వర్క్స్ (రూ. 1 కోటి), టీవీఎస్ క్యాపిటల్ ఫండ్స్‌కు చెందిన గోపాల్ శ్రీనివాసన్ (రూ. 5 లక్షలు) ఇచ్చినట్టు తెలిపాయి. ఇవి కాకుండా విరాళాలు ఇచ్చిన ఎస్పీ, జేడీ(యూ) పార్టీలు వివరాలు చెప్పలేదు. ఇవి 10 కోట్లు వరకూ ఉంటాయని..వీటిని పోస్ట్ ద్వారా, లేదా డైరెక్ట్‌గా పార్టీ కార్యాలయానికి వచ్చి ఇవ్వడం ద్వారా అంది ఉంటాయని తెలుస్తోంది.
Also Read:National: 6 రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఆదేశాలు