TG Jobs: హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్ర గ్రంథాలయం వద్ద హై టెన్షన్ వాతవరణం నెలకొంది. గ్రూప్-2, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ సంఘాల పిలుపు మేరకు భారీ ఎత్తున్న అభ్యర్థులు తరలివచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే గ్రూప్ 2, 3, డీఎస్సీ వాయిదా వేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో చిక్కడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొనగా భారీగా పోలీసులు బలగాలు లైబ్రరీ వద్దకు చేరుకుని ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఇరువురి మధ్య తోపులాట జరగగా.. పోలీసులు నిరుద్యోగులపై లాఠీ ఛార్జీ చేశారు. దీంతో పరిస్థితి ఆందోళన కరంగా మారింది. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు కలిసి సెక్రటేరియట్ ముట్టడికి యత్నించారు. డీఎస్సీ, గ్రూప్స్ 2, 3 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.