Darling Release Trailer: టాలీవుడ్ నటుడు, కమెడియన్ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ డార్లింగ్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని అశ్విన్ రామ్ తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన మూవీ ప్రమోషనల్ కంటెంట్ తో ఆకట్టుకున్న ఈ మూవీ జులై 19న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.
డార్లింగ్ ట్రైలర్
ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో ప్రియదర్శి , నభా నటేశ్ మధ్య సన్నివేశాలు అలరిస్తున్నాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న ప్రియదర్శి ఫ్రస్ట్రేషన్, భార్యతో తాను పడే పాట్లు, ఫ్రెండ్స్ మధ్య జరిగే సంభాషణలు నవ్వులు పూయించాయి. ‘బలైపోయే మేకకు బలుపెక్కువట’, ‘దీనమ్మ.. పెద్ద మహానటిరా ఇది’, ‘నా పెళ్లాం బెల్లం రా’ వంటి ఫన్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా కనిపించింది ట్రైలర్. ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మోయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, బ్రహ్మానందం, కళ్యాణి రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.