Hyderabad: హైదరాబాద్ కూకట్‌పల్లిలోని దేవీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సీఐ శేఖర్ ఇంటిపై నుంచి కిందపడిన కానిస్టేబుల్ డేవిడ్ మృతి చెందారు. రాచకొండ కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో పనిచేస్తున్న సీఐగా పని చేస్తున్న శేఖర్ బర్త్‌డే వేడుకలకు దాదాపు 30 మందికి పైగా ఫ్రెండ్స్ హాజరయ్యారు. అందులో 10 మంది పోలీసులుండగా డేవిడ్ కూడా ఒకరు. అయితే బర్త్‌డే పార్టీ జరుగుతున్న సమయంలోనే 3వ అంతస్తు నుంచి డేవిడ్ అనుకోకుండా కిందపడిపోయాడు. దీంతో అతని తలకు బలమైన గాయలుకావడంతో స్పాట్లోనే కన్నుమూశాడు హెడ్‌కానిస్టేబుల్ డేవిడ్. ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన డేవిడ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.