CIL Recruitment 2023: ఇంజినీరింగ్ డిగ్రీని కలిగి ఉన్నారా? మంచి జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే.. మీకో శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) భారీగా ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (CIL Notification) విడుదల చేసింది సంస్థ. మొత్తం 560 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13న ప్రారంభించింది కోల్ ఇండియా. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 12ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
– మైనింగ్ : 351
– సివిల్ : 172
– జియాలజీ : 37
మొత్తం: 560
విద్యార్హతల వివరాలు:
మైనింగ్: అభ్యర్థులకు మైనింగ్ ఇంజినీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి.
సివిల్: సివిల్ ఇంజనీరింగ్ లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జియాలజీ: జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీలో కనీసం 60 శాతం మార్కులతో ఎంఎస్సీ\ఎంటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
– ఈ విద్యార్హతలతో పాటు గేట్-2023లో (GATE-2023) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థులు ఆగస్టు 1 నాటికి 30 ఏళ్లను మించకూడదు. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
-ఇతర వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు.
దరఖాస్తు ఫీజు: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు రూ.1180ని అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించారు అధికారులు. అయితే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజులో మినహాయింపు ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
- పూర్తి వివరాలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఎలా అప్లై చేయాలంటే?
– అభ్యర్థులు మొదటగా https://www.coalindia.in/ వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
– అనంతం Career with CIL ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
– తర్వాత Jobs at Coal India విభాగాన్ని ఎంచుకోవాలి. మీ వివరాలను నమోదు చేసి అప్లికేషన్ ను పూర్తి చేయాలి.
అభ్యర్థుల ఎంపిక: అభ్యర్థుల గేట్-2023 స్కోర్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Also Read: దేశసేవ చేయాలనుకునేవారికి శుభవార్త…ఆర్మీలో ఈ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్..!!