వేములవాడలో ఎగిరేది కాషాయ జెండానే అంటున్నారు బీజేపీ అభ్యర్థి చెన్నమనేని వికాస్. వేములవాడ ప్రజలు తనను ఎమ్మెల్యే గెలిపించబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చేసిన కార్యక్రమాలే తనను భారీ మెజార్టీతో గెలిపిస్తాయన్నారు. డాక్టర్ దవాఖాన మీ దర్వాజ దగ్గర అనే నినాదంతో ఇంతకాలం ప్రజల్లోకి వెళ్లినట్లు తెలిపారు. ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ప్రజల ముందుకు వెళ్తుంటే…నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు. ఎలాంటి పదవులు లేనప్పుడే ప్రజలకు సేవా కార్యక్రమాలు చేశానని…ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడ దశ, దిశను మార్చే సత్తా తనకుందన్నారు. వేముల వాడ నియోజకవర్గంలో ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు నైపుణ్యాభివ్రుద్ధి కేంద్రం తీసుకువస్తామని వెల్లడించారు. ఆర్టీవీతో చెన్నమనేని కల్యాణ్ పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియోలో చూడండి.
ఇది కూడా చదవండి : సర్కార్ సంచలన నిర్ణయం.. ఇక నియామక పరీక్షలకు ఆ డ్రెస్సులతో వస్తే నో ఎంట్రీ..!!