RGV comments on CBN Gratitude Concert: ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు హాట్ హాట్‌గా మారాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో గత 52 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. ఆయన అరెస్ట్ ను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సంఘీభావ ప్రదర్శనలు చేపట్టడం తెలిసిందే.అయితే చంద్రబాబు అరెస్ట్ పై గత కొన్ని రోజులుగా వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు నారా లోకేష్‌కు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
అయితే, నిన్న హైదరాబాద్ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ తన బృందంతో ఉర్రూతలూగించారు. దీనిపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. “సెలబ్రిటీ కార్యక్రమాలు ఏదైనా విషాద ఘటన కారణంగానో, నిరసనల కారణంగానో రద్దవడం చాలాసార్లు విన్నాను. కానీ, ఓ మాజీ ముఖ్యమంత్రి జైల్లో ఉంటే సంగీత కచేరీ నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారి అనుకుంటా. అది చంద్రబాబు విషయంలో జరిగింది” అంటూ ట్వీట్ చేశారు.
I heard many times about celebratory events being CANCELED in grief and protest ..This is the first time a MUSICAl event has been created to CELEBRATE an ex cm @ncbn being in JAIL 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2023
ఇటీవలే ఆర్జీవీ.. సెంట్రల్ జైలు ముందుకు వెళ్లి సెల్ఫీ తీసుకుని.. “ఆయన లోపల, నేను బయట” అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై.. నారా లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆర్జీవీ ఏం చేశాడు అంటూ విమర్శలు గుప్పించారు. ఆ విమర్శలపై స్పందించిన ఆర్జీవీ.. లోకేష్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఈ మేరకు ట్వీట్టర్లో.. తన బెడ్ రూం నుంచి మాట్లాడిన ఓ వీడియోను కూడా వదిలాడు ఆర్జీవీ. లోకేష్‌ను చూసి జాలిపడాలా.. నవ్వాలా.. ఏం చేయాలో అర్థం కావట్లేదంటూ ఆర్జీవీ ఎద్దేవా చేశాడు. ఇలా చంద్రబాబు అరెస్ట్ పై ట్వీట్ లు పెడుతూ ..వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు టాలీవుడ్ డైరెక్టర్ ఆర్జీవీ.