Nandyal: నంద్యాల జిల్లా టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి RTVతో ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం జగన్ దాడిపై స్పందించారు. కోడి కత్తిలా గులకరాయి డ్రామా చేస్తే.. ఇంకోసారి 100 గులకరాల్లు వేస్తారని కామెంట్స్ చేశారు. వైసీపీ నాటకాలను ప్రజలను నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన ప్రజలకు అప్పుల భారం తప్ప చేసిందేమి లేదన్నారు. ప్రతి ఒక్కరిపైన మూడు లక్షల అప్పుల భారం పెట్టాడని ధ్వజమెత్తారు.
Also Read: పులివెందుల నా ప్రాణం.. నామినేషన్ సందర్భంగా జగన్ ఎమోషనల్-VIDEO
జాతీయ రహదారులు కట్టింది కేంద్రం అయితే..తానే కట్టానని చెప్పుకుంటున్నాడని బుగ్గనపై విమర్శలు గుప్పించారు. బుగ్గున మంత్రిగా చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలని సవాల్ విసిరారు. జిల్లాలో ప్రజలు తాగడానికి కూడా నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శలు గుప్పించారు. ఏ ప్రాజెక్ట్ సరిగా పేర్తి చేయలేదని దుమ్మెత్తిపోశారు. ప్రజలు ఈసారి ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా వైసీపీ ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానందరెడ్డి… తనన్ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.