Raashii Khanna About Baak: స్టార్ నటి రాశీఖన్నా . తన అప్ కమింగ్ మూవీ ‘బాక్’ (Baak) చిత్ర విశేషాలు పంచుకుంది. మే 3న విడుదల కానున్న సినిమాలో తాను పోషించిన పాత్ర భిన్నమైనదని చెప్పింది. మొదట్లో ఇలాంటి పాత్రలు తాను చేయగలనన్న దానిపై స్పష్టత లేదని, బెల్లం శ్రీదేవి (సుప్రీమ్ చిత్రం)లాంటి కామెడీ టైమింగ్ ఉన్న పాత్రను చేస్తానని ఊహించలేదని తెలిపింది. అయితే ఇందులో దాన్నొక ఛాలెంజ్‌గా తీసుకుని నటించానని, ఇదొక కొత్త అనుభవమని తెలిపింది. ఓ నటిగా అన్ని రకాల పాత్రల్లో నటించాలనుందంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. కోలీవుడ్ దర్శకుడు సుందర్ సి. (Sundar C) ప్రధాన పాత్ర పోషిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రమిది.
Howz the look? pic.twitter.com/Ku6n0CTBVO
— Raashi Khanna (@RaashiKhanna) April 30, 2024