Hyderabad: సినీ నటులు కావాలనుకునే వారికి అన్నపూర్ణ స్టూడియోస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ బ్యానర్ లో కొత్తగా తెరకెక్కించబోయే ‘కనబడుటలేదు’ సినిమాకు ఉత్సాహవంతులైన యువతి, యువకుల నుంచి దరఖాస్తులు కోరింది. యంగ్ బాయ్స్ 14-16, యంగ్ గర్ల్స్ 14-16, అమ్మాయిలు 22-26 ఏళ్ల వయసు ఉండాలని ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. అలాగే ఒక నిమిషం నిడివిగల ఆడిషన్ వీడియో, పోర్ట్ పోలియోను ‘actors@annapurnastudios.com’ మెయిల్‌కు పంపంపిచాలని సూచించింది. గాగుల్స్, కళ్లద్దాలతో తీసిన ఫొటోలు అంగీరించబడవని స్పష్టం చేసింది.
CASTING CALL 🎬
Looking for enthusiastic actors for our film 📢
Kindly send in your portfolio and a 1-minute audition video to the below-mentioned email.
actors@annapurnastudios.com 📩#AnnapurnaStudios #CastingCall pic.twitter.com/WzQKMiZq3y
— Annapurna Studios (@AnnapurnaStdios) June 21, 2024