Allu Arjun: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు, హీరోయిన్స్ యాక్టింగ్ కెరీర్ తో పాటు బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోలు ఒకరి తర్వాత ఒకరు మల్టీ ప్లెక్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే థియేటర్ బిజినెస్ లో అడుగుపెట్టిన మహేష్ బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవర కొండా సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు.
మరో మల్టీ ప్లెక్స్ కు ప్లాన్ చేసిన అల్లు అర్జున్
ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే హైదరాబాద్ లో AAA సినిమాస్ పేరుతో మల్టీ ప్లెక్స్ నిర్మించిన అల్లు అర్జున్.. తాజాగా మరో మల్టీ ప్లెక్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ అది తెలంగాణాలో కాదు ఏపీలో అని తెలుస్తోంది. వైజాగ్ లో కొత్తగా నిర్మిస్తున్న ఇనార్బిట్ మాల్ లో మల్టీ ప్లెక్స్ ఓపెనింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఏషియన్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో ఉన్నట్లే హై క్లాస్ స్టాండర్స్ తో ఈ థియేటర్ ను నిర్మించబోతున్నారని టాక్. ఇంకా దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇటీవలే మాస్ మహారాజ్ రవితేజ కూడా ఏషియన్ సంస్థతో కలిసి హైదరాబాద్ లో మల్టీ ప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిసింది. దిల్సుఖ్ నగర్లో ఓపెన్ కానున్న ఈ థియేటర్ కు ‘ART’ అనే పేరు పెట్టబోతున్నట్లు సమాచారం. కాగా గచ్చిబౌలిలో AMB పేరుతో మహేష్ బాబు, అమీర్ పేట్ లో AAA పేరుతో అల్లు అర్జున్, మహబూబ్ నగర్ లో AVD పేరుతో విజయ్ దేవకొండ మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించారు.
Also Read: Guntur Kaaram Movie: టీవీలోకి వచ్చేస్తున్న గుంటూరు కారం.. ఆ స్పెషల్ డే రోజే టెలికాస్ట్..!