Actor Akash Puri : టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి ఇకపై తన పేరును ఆకాశ్ జగన్నాథ్ అని మార్చుకున్నారు. ఆకాశ్ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఇకపై తన పేరు ఆకాశ్ పూరీ కాదని.. ఆకాశ్ జగన్నాథ్ అని ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేర్లు మార్చుకోవడం అనేది కొత్త విషయం కాదు.
కొంతమంది నటులు, నిర్మాతలు తమ కెరీర్‌ను మరింతగా ప్రభావితం చేయడానికి తమ పేర్లను మారుస్తారు. చాలా మంది తమ పాత పేరుతో గుర్తింపు పొందలేకపోవడం వల్ల కొత్త పేరును ఎంచుకుంటారు. కొంతమంది జ్యోతిష్యుల సలహా మేరకు తమ పేర్లను మారుస్తారు. కొందరు వ్యక్తిగత కారణాల వల్ల తమ పేర్లను మార్చుకోవడానికి ఇష్టపడతారు.
Also Read : రెండో సారి తల్లి కాబోతున్న ‘పవన్’ హీరోయిన్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫొటోలు!
అయితే ఉన్నట్టుండి ఆకాశ్ తన పేరు మార్చుకోవడానికి గల కారణం చెప్పలేకపోయినా.. సినీ కెరియర్ పరంగా మరిన్ని అవకాశాలు వచ్చేందుకే ఇలా పేరు మార్చుకున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తుంది. ఆకాశ్ పేరు మార్చుకున్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కాగా ఆకాశ్ ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకోగా.. తన కొత్త పేరుతో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని భావిస్తున్నాడు. మరి ఈ పేరు మార్పు ఆకాశ్ కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది? కొత్త పేరుతో ఎలాంటి విజయాలు సాధిస్తారో చూడాలి.
View this post on Instagram