Abhishek – Aishwarya : బాలీవుడ్ (Bollywood) నటులు అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan), ఐశ్వర్యరాయ్ (Aishwarya Rai) విడాకుల ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. కొంత కాలంగా వీరిద్దరి మధ్య సఖ్యత లేదని, విడివిడిగా ఉంటున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసింతే. కాగా రీసెంట్ గా అనంత్ అంబానీ పెళ్లికి కూతురితో ఐశ్వర్యరాయ్, తండ్రి అమితాబ్, తల్లి, సోదరితో అభిషేక్ హాజరుకావడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు అనంత్ – రాధిక మర్చంట్ (Anant Ambani – Radhika Merchant) వివాహ వేడుకలో అభిషేక్, ఐశ్వర్య పక్కపక్కనే కూర్చున్నప్పటికీ దంపతులు మాట్లాడుకోకపోవడం విశేషం. ఐశ్వర్యరాయ్ కేవలం తన కూతురితోనే ఉత్సాహంగా ముచ్చటించింది. అయితే ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇక అభిషేక్ సల్మాన్ ఖాన్, ధోనీ అతిథులను పలకరిస్తూ కనిపించారు. అయితే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ జంటను మాత్రం జూమ్ చేసి చూపించడంతో ఆసక్తికరంగా మారింది. కెమెరాను చూసి ఐశ్వర్యరాయ్ స్మైల్ ఇవ్వడం విశేషం. కాగా అభిషేక్, ఐశ్వర్య విడిపోవడం లేదని ఈ వీడియోతో క్లారిటీ వచ్చిందని చాలా మంది అంటున్నారు. అయితే అభిషేక్ ఐశ్వర్యతో మాట్లాడకపోవడాన్ని కొంతమంది పాయింటవుట్ చేస్తున్నారు.
NEW: Aishwarya & Aaradhya (posted by Abhishek on Instagram. Captioned photo decorated by Aaradhya) Cuteness overload! pic.twitter.com/NBWckbwyeO
— Aishwarya Rai Online (@AishwaryaRaiWeb) November 19, 2016
Also Read : మణిపూర్లో మరోసారి కాల్పులు.. జవాన్ మృతి