Actress Aishwarya Rai Injured : బాలీవుడ్(Bollywood) అగ్ర హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) తాజాగా చేతికి గాయంతో కనిపించింది. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ ఐశ్వర్య రాయ్ కి ఏమైందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..
ఐశ్వర్య రాయ్ చేతికి గాయం
ఇటీవల ఫ్రాన్స్ లో 77 వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్(77th Cannes Film Festival) గ్రాండ్ గా ప్రారంభం అయిన సబ్గర్తి తెలిసిందే. ప్రతీ ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ కి ఐశ్వర్య రాయ్ వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జరుగుగుతున్న ఈ వేడుకలో ఇండియా తరుపున పార్టిసిపేట్ చేసేందుకు ఐశ్వర్య రాయ్ తన కూతురితో కలిసి వెళ్ళింది. ఈ క్రమంలోనే ముంబై ఎయిర్ పోర్ట్ లో ఐశ్వర్య తన కుడి చేతికి ఆర్మ్ స్లింగ్ తో కనిపించింది.
Also Read : కాబోయే వాడి గురించి ఎట్టకేలకు నోరు విప్పిన ‘దేవర’ బ్యూటీ.. అతన్నే పెళ్లి చేసుకుంటుందట!
ఇదికాస్త అభిమానులను ఆందోళనకు గురిచేసింది. చేతికి ఉన్న కట్టు చూస్తుంటే తీవ్రమైన గాయం అయినట్లు కనిపిస్తోంది. దీంతో ఐశ్వర్యా రాయ్ కి అసలేమైందో తెలియక కంగారు పడుతున్నారు. చేతికి గాయంతో కనిపించిన ఐశ్వర్యను చూసి ఫ్యాన్స్ ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. కాగా ఐశ్వర్య గాయం పై ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఐశ్వర్య రాయ్ తో పాటూ అదితి రావు హైదరీ, శోబితా ధూళిపాళ, కియారా అద్వానీ సైతం సందడి చేయనున్నారు.
Take care Aishwarya! May you recover soon. Aaradhya, my little big girl, take good care of your mother. May God Almighty Bless you both. AUM Namah Shivaay 🙏 https://t.co/oknzAox1K5
— Aishwarya Rai Adorer Arijit Bhattacharya (@Aishusforever) May 16, 2024