Acctress Adah Sharma Interview : టాలీవుడ్ హీరోయిన్ అదా శర్మ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతుందట. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టింది. ఆ వ్యాధి వల్ల తాను ఎంతో ఒత్తిడికి కూడా గురైనట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె ఆలస్యంగా బయటపెట్టడం గమనార్గం. ఇంతకీ అదా శర్మ ఏ వ్యాధితో బాధపడుతుంది? అనే వివరాల్లోకి వెళితే…
నితిన్ ‘హార్ట్ ఎటాక్’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా వాటితో పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది. అక్కడ గత ఏడాది ‘ది కేరళ స్టోరీ’ మూవీతో భారీ కంబ్యాక్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదా శర్మ తనకు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిపింది.
Also Read : నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో.. వెండితెరకు పరిచయం చేయబోతున్న ఒకప్పటి స్టార్ డైరెక్టర్!
బరువు పెరిగాను
కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘బస్తర్’ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని’
బాడీలో చేంజెస్
‘కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను’ అని చెప్పుకొచ్చింది.