Bollywood Actor : బాలీవుడ్(Bollywood) నటుడు సల్మాన్ ఖాన్(Salman Khan) ఇంటి బయట కాల్పుల ఘటనలో సీసీటీవీ ఫుటేజీలో కనిపించిన ఇద్దరు షూటర్లలో ఒకరు హర్యానా(Haryana) లోని గురుగ్రామ్‌కు చెందిన వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అని ముంబై పోలీసులు(Mumbai Police) చెబుతున్నారు. లారెన్స్ బిష్ణోయ్(Lawrence Bishnoi) గ్యాంగ్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్‌స్టర్ రోహిత్ గోదారాకు సంబంధించిన షూటర్ గ్యాంగ్‌స్టర్ విశాల్ రాహులే ప్రదాన నిందితుడు అని చెబుతున్నారు. దీనికి సంబంధించి ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ సోషల్ మీడియా పోస్ట్‌లో తామే కాల్పులు జరిపించామని ప్రకటించాడు. ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని పేర్కొన్నాడు కూడా. ఇప్పుడు నిందితుడికి సంబంధించి మరిన్ని ఆధారాలు వెలుగులోకి వస్తున్నాయి.
మరిన్ని కొత్త విషయాలు…
సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన వారిలో ఇప్పటికే ఒకరిని గుర్తించారు పోలీసులు. అయితే ఇప్పుడు తాజాగా కొత్త విషయాలు కూడా చెబుతున్నారు. కాల్పులు జరిపింది ఇద్దరు కాగా అందులో ఒకరు కెనడాకు చెందిన వ్యక్తి అని తెలిపారు. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తున్న ఫేస్బుక్ పేజీ ఐపీ అడ్రస్ కెనడాకు చెందినదని తేలిందని పోలీసులు చెప్పారు. అంతేకాదు కాల్పులకు వ్యూహరచన అమెరికాలో జరిగిందని అన్నారు. దాదాపు నెలరోజులుగా దీని గురించి ప్లాన్ చేస్తున్నారని తెలిపారు.
గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి..
ఇక విశాల్ రాహుల్ గురించి కూడా వివరాలు చెబుతున్నారు పోలీసులు. విశాల్ అలియాస్ కాలు గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తి. ఇతను పదవ తరగతి వరకు చదివాడు. కాలుపై 5కి పైగా క్రిమినల్ కేసులునమోదయ్యాయి. రీసెంట్గా కాలు గ్యాంగ్‌స్టర్ ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ సూచన మేరకు రోహ్తక్లో బుకీ హత్యకు కూడా పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇందులో బుకీ తల్లిపై కూడా విశాల్ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. దాంతో పాటూ ఫిబ్రవరి 29న రోహ్తక్లోని ధాబాలో జరిగిన హత్యలో కూడా విశాల్ ప్రమేయం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు బృందం విశాల్ ఇంటిలో సోదాలు చేసేందుకు వెళ్ళింది. అయితే సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన వెంటనే నిందితులు ఇద్దరూ పరారయ్యారు. వారు ఇప్పటి వరకు దొరకలేదు. వీరి గురించి ఢిల్లీ పోలీసులు(Delhi Police), క్రైమ్ బ్రాంచ్, స్పెషల్ సెల్ బృందాలు వెతుకుతున్నాయి. హర్యానా సోలీసులుకూడా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:Andhra Pradesh : సీఎం జగన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..పోలీసుల అదుపులో నలుగురు నిందితులు