Jobs In Indian Railways : ఇండియన్ రైల్వేస్(Indian Railways) భారీగా ఉద్యోగాలను ప్రకటించింది., ఏకంగా 8 వేల ఉద్యోగాల ఖాళీలను(Job Vacancies) బర్తీ చేయనున్నామని తెలిపింది. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే దరఖాస్తుల ప్రక్రియ మాత్రం మేలో మొదలవుతుందని అంటోంది. నెల రోజుల పాటూ దరఖాస్తులను స్వీకరిస్తారని… ఆ తరువాత పరీక్ష ఉంటుందని తెలిపింది. పరీక్ష తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు.
ఉద్యోగ వివరాలు..
ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్: 8,000 పైగా పోస్టులు
వయసు:
కనీస వయస్సు – 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు – 28 సంవత్సరాలు
జీతం :
ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్(TTE) వేతనం రూ. 27,400 నుండి రూ. 45,600 వరకు ఉంటుంది. స్థాయిని బట్టి జీతాన్ని అంచనా వేస్తారు.
అర్హతలు:
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇవి కాకపోతే గుర్తింపు పొందిన బోర్డు నుండి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం:
టీటీఈ ఉద్యోగాలకు ఎంపిక చేసేందుకు మూడు పరీక్షలు ఉంటాయి. ముందుగా రాత పరీక్ష ఉంటుంది. దాని తరువాత ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
అప్లికేషన్ కోసం జనరల్ , OBC వర్గాలకు: రూ. 500రూ… SC/ST వర్గాలకు: రూ. 300రూ. ఫీజు చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేయాలి:
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్ధులు ముందుగా indianrailways.gov.in లోకి వెళ్ళి.. TTE రిక్రూట్మెంట్ 2024ని సెర్చ్ చేయాలి. అక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాలి. ఆ లింకులో అడిగిన పూర్తి సమాచారాన్ని భర్తీ చేయాలి. దాని తరువాత పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అప్లోడ్ చేసి , థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి. ఇదయ్యాక అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అన్నీ అయ్యాక దరఖాస్తు చేసిన తేదీని సేవ్ చేసుకుని సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం indianrailways.gov.in భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
Also Read:Andhra Pradesh : ఐదు స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల మార్పు