Health Tips : దేశంలో చలి తీవ్ర పెరుగుతోంది. ఈ చల్లని వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ఒంటి నొప్పులు, ఇన్ఫెక్షన్లు ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఈ కాలంలో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గితే ఎన్నో సమస్యలు వేధిస్తుంటాయి. చలి నుంచి బయటపడేందుకు వేడిని కలింగిచే బట్టు వేసుకోవాలి. అయితే ఈ చలి మగవాళ్ల కంటే ఆడవాళ్లలో (Women are more cold)నే ఎక్కువ ఉంటుందట. ఆడవాళ్లే చలిని ఎక్కువగా అనుభవిస్తారట.
అయితే వైద్యుల అభిప్రాయం ప్రకారం..పురుషుల కంటే మహిళలకే ఎక్కువ చలి పెడుతుందని చెబుతున్నారు. అందుకే ఒకే వాతావరణం (weather) పురుషులకు నార్మల్ గా అనిపించినా ఆడవాళ్లకు మాత్రం మరీ చల్లగా అనిపిస్తుందట. దీనికి కారణంగా ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపమేనట. వీటివల్లే ఆడవాళ్లకు చలి ఎక్కువగా అనిపిస్తుందట.
ఆడవారిలో కండరాలు తక్కువగా ఉంటాయి:
నిపుణుల అభిప్రాయం ప్రకారం స్త్రీలకు వారి శరీరంలో కండర ద్రవ్యరాశి (Muscle mass)తక్కువగా ఉంటుందట. దీని కారణంగా వారు మరింత చల్లగా ఉంటారు. తక్కువ కండరాల కారణంగా, అమ్మాయిల శరీరం అబ్బాయిల కంటే తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది. దీని వల్ల చలి ఎక్కువగా అనిపిస్తుంది. స్త్రీల శరీరంలో కంటే పురుషుల శరీరంలో 6-11 శాతం ఎక్కువ కొవ్వు ఉంటుంది. దీని కారణంగా వారి శరీరం వెచ్చగా ఉంటుంది.
తక్కువ జీవక్రియ రేటు:
స్త్రీలు పురుషుల కంటే తక్కువ జీవక్రియ రేటు (metabolic rate)ను కలిగి ఉంటారు. దీని కారణంగా వారు మరింత చల్లగా ఉంటారు. నెమ్మదిగా జీవక్రియ ఉన్న వ్యక్తులు తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తారు. పురుషులు చాలా మంచి జీవక్రియ రేటును కలిగి ఉంటారు, ఇది వారి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
ప్రొజెస్టెరాన్ హార్మోన్:
ప్రొజెస్టెరాన్ హార్మోన్ (Progesterone hormone)స్త్రీల శరీరంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా వారు మరింత చల్లగా ఉంటారు. దీని కారణంగా చర్మం యొక్క రక్త నాళాలు కుదించబడతాయి. శరీరంలోని కొన్ని భాగాలకు రక్తం సరిగ్గా ప్రవహించదు, దీని కారణంగా ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. ఈ హార్మోన్ శరీరంలో తక్కువ వేడిని ఉత్పత్తి చేస్తుంది, కానీ పీరియడ్స్, గర్భధారణకు సహాయపడుతుంది.
చలిలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం ఎలా?
– మంచి దుస్తులు ధరించండి. అనేక పొరల వెచ్చని దుస్తులను ధరించండి.
– ప్రతిరోజూ కనీసం అరగంట పాటు ఎండలో కూర్చోండి
– వేడి ఆహారం, వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి
-రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి
– విటమిన్ బి12 పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోండి
– శరీరంలో ఐరన్ లోపాన్ని తొలగిస్తుంది
-చలికాలంలో వేడి నూనెతో మీ శరీరాన్ని మసాజ్ చేయండి
ఇది కూడా చదవండి: కడుపులా? కాగులా? 9 నెలల్లో రూ. 1308 కోట్ల మద్యం తాగారట..ఎక్కడో తెలుసా?