కేజ్రీవాల్ కు చుక్కెదురు.... హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వలేమన్న సుప్రీం కోర్టు...!

సీఎం కేజ్రీవాల్ కు షాక్ తగిలింది. గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ కేసు ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు ఎదుట పెండింగ్ లో వుందన్నారు. అందువల్ల ఇప్పుడు స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో ఏమైనా సమస్యలు వుంటే గుజరాత్ హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని సూచించింది.

author-image
By G Ramu
లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‎కు ఈడీ నోటీసులు ..నవంబర్ 2న విచారణకు రావాలని నోటీస్..!!
New Update

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువునష్టం కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఆయన చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరగ్గా కేజ్రీవాల్, వర్సిటీల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ కేసుపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఈ కేసు గుజరాత్ హైకోర్టు ఎదుట పెండింగ్ లో వుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఇప్పుడే దానిపై నోటీసులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ కేసులో సమస్యలేమైనా వుంటే హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లాలని గుజరాత్ వర్సిటీ, కేజ్రీవాల్ కు సూచించింది. అనంతరం ఈ కేసులో విచారణను ఈ నెల 29కు ధర్మాసనం వాయిదా వేసింది.

ప్రధాని మోడీ డిగ్రీకి సంబంధించిన వివరాలను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు అందజేయాలని గతంలో కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో సీఐసీ ఆదేశాలను హైకోర్టులో గుజరాత్ వర్సిటీ సవాల్ చేసింది. విచారణ చేపట్టిన హైకోర్టు సీఐసీ ఆదేశాలను కొట్టి వేసింది. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్ ను ఎవరికీ చూపించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.

సమాచార హక్కు చట్టాన్ని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయనకు రూ. 25 వేలు జరిమానా విధించింది. అనంతరం సీఎం కేజ్రీవాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ వ్యాఖ్యలు వర్సిటీని అవమానించేలా వున్నాయంటూ వర్సిటీ అధికారులు పరువునష్టం దావా వేశారు. ఈ కేసులో విచారణ నిమిత్తం గుజరాత్ మెట్రోపాలిటన్ న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఆ ఆదేశాలను సెషన్స్ కోర్టులో సవాల్ చేయగా అక్కడ ఆయనకు నిరాశ ఎదురైంది. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది.

#gujarath-university #degree-certificate #gujarath-high-court #cm-kejriwal #pm-modi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి