T20 World Cup 2024: నెదర్లాండ్స్ పై భారీ విజయం సాధించిన శ్రీలంక! టీ20 వరల్డ్ కప్‌లో సెయింట్ లూసియా వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన పోరులో శ్రీలంక 83 పరుగుల రికార్డు విజయం సాధించింది.మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లకి 6 వికెట్లు కోల్పొయి 201 పరుగులు చేసింది.ఛేజింగ్ ప్రారంభించిన నెదర్లాండ్ 118 పరుగులకే ఆలౌటైంది. By Durga Rao 17 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Sri Lanka vs Netherlands: నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. 2024 టీ20 ప్రపంచకప్‌లో 200+ స్కోరు నమోదవ్వడం ఇదే రెండో సారి. ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 201 పరుగులే చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఓపెనర్ నిశాంక డకౌట్ తో వెనుతిరిగాడు. కామిందు మెండిస్ (17; 20 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన డిసిల్వా (34; 26 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి కుశాల్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. వీరిద్దరు దూకుడుగా ఆడారు. కుశాల్, డిసిల్వా ఔటైన తర్వాత బాదే బాధ్యతను అసలంక, మాథ్యూస్ (30 నాటౌట్; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) అందుకున్నారు. Sri Lanka sign off the #T20WorldCup with a comfortable win over Netherlands 👏#SLvNED: https://t.co/8emxMgGCqW pic.twitter.com/UblMPk95oW — T20 World Cup (@T20WorldCup) June 17, 2024 ఆఖర్లో హసరంగ 6 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్ల తో విరుచుకుపడంతో చివరి అయిదు ఓవర్లలో 77 పరుగులను లంక సాధించింది. అనంతరం భారీ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్ 16.4 ఓవర్లలో 118 పరుగులకు ఆలౌటైంది. మైకేల్ (31; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), స్కాట్ ఎడ్వర్ట్స్ (31; 24 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్లు. నువాన్ తుషారా మూడు, హసరంగ, పతిరనా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే ఛేజింగ్‌లో నెదర్లాండ్స్ శుభారంభం దక్కింది.ఓపెనర్లు 5.3 ఓవర్లలో 45 పరుగులు సాధించారు. కానీ ఆ తర్వాత క్రమంగా వికెట్లు కోల్పోయి డచ్ ఓటమిపాలైంది. Also Read: టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే.. #sri-lanka #netherlands మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి