Sprouts Health: ఆరోగ్యం పై ఎక్కువగా శ్రద్ధ చూపే వారు.. వాళ్ళ ఆహార దినచర్య చాలా ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటారు. ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగడం, నానబెట్టిన డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన గింజలు తింటారు. రోజు మనం తినే ఆహారపు అలవాట్లు ఆరోగ్యం పై మంచి ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా రోజు ఉదయం స్ప్రౌట్స్ తింటే..వీటిలోని అధిక విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. రోజు ఉదయం.. శనగలు, పెసళ్ళు, బీన్స్ ఇలా పలు రకాల గింజలను నానా బెట్టి మొలకెత్తిన తర్వాత తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజు ఉదయాన్నే మొలకెత్తిన గింజలు తింటే కలిగే లాభాలు
మొలకెత్తిన గింజల్లో జీర్ణక్రియను మెరుగుపరిచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రోజు ఉదయాన్నే మొలకలు తింటే అజీర్ణ సమస్యలు ఉన్నవారికి బాగా ఉపయోగపడును. అంతే కాదు జీర్ణక్రియ మెరుగ్గా పని చేయడానికి సహాయపడుతుంది.
ప్రోటీన్ నాణ్యతను పెంచును
సాధారణంగా తినే వాటి కంటే.. మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్ నాణ్యత ఎక్కువగా ఉంటుంది. రోజు నానబెట్టిన మొలకలు తింటే శరీరానికి మంచి ప్రోటీన్ లభిస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడును
రోజు ఉదయాన్నే మొలకలు తింటే.. వాటిలోని అధిక ప్రోటీన్ ఎక్కువ సమయం వరకు ఆకలిని కలిగించదు. దాని వల్ల శరీరంలో కెలరీలు శాతం తగ్గిపోయి.. బరువు తగ్గడంలో సహాయపడును.
రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించును
మొలకెత్తిన గింజలు తింటే.. రక్తంలోని చక్కర స్థాయిల పై మంచి ప్రభావాన్ని చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండె ఆరోగ్యం మెరుగుపరుచును
మొలకెత్తిన గింజల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వీటిని రోజు మన ఆహారంలో తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గించి.. గుండె ఆరోగ్యం పై మంచి ప్రభావం చూపును. అంతే కాదు రక్తపోటును కూడా నియంత్రించడంలో సహాయపడును.
రోగ నిరోధక శక్తిని పెంచును
మొలకెత్తిన గింజల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ తో పాటు విటమిన్ 'C' ఎక్కువగా ఉండును. ఇది శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచును.
Also Read: Chocolate : చాక్లెట్స్ అంటే ఇష్టమా.. అయితే ఇది తప్పక చూడండి..!