Asian Champions Trophy Women
భారత అమ్మాయిల జట్టు అదరగొట్టింది. తమకు ఎదురన్నదే లేదని నిరూపించింది. ఆసియా ఛాంపియన్స్ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా కప్‌ను గెలుచుకుంది. ఈరోజు జరిగిన ఫైల్ మ్యాచ్‌లో 1–0తో చైనాను చిత్తు చేసింది భారత అమ్మాయిల జట్టు. ఆద్యంతం ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో చివరలో దీపిక 341వ నిమిషంలో గోల్ చేయడంతో విజయం భారత్ ను వరించింది.
Also Read : పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి
Also Read : మహారాష్ట్రలో గెలిచేది మహాయుతి కూటమే.. సంచలన ఎగ్జిట్ పోల్స్!
అంతకు ముందు సెమీ ఫైనల్‌లోనూ అదే దూకుడు కనబరిచింది టీమ్ ఇండియా.సెమీ ఫైనల్ మ్యాచ్ మొదలయ్యాక మొదటి 3 క్వార్టర్స్‌లో ఇరు జట్లూ నువ్వా నేనా అన్నట్టు ఆడాయి. మూడు సెట్లు పూర్తయ్యేంత వరకూ ఇండియా, జపాన్ కూడా ఒక్క గోల్ చేయలేకపోయాయి. దీతో మ్యాచ్ ఉత్కంఠంగా మారింది. ఇక నాలుగో క్వార్టర్‌లో మాత్రం ఒత్తిడిని చిత్తు చేస్తూ భారత ప్లేయర్స్ 2 గోల్స్ వేశారు. భారత వైస్ కెప్టెన్ నవీనీత్ కౌర్ మొదటి గోల్ చేయగా.. లాల్‌రెమ్సియామి రెండో గోల్ చేసింది. మరోవైపు చైనా, మలేసియా జట్ల మధ్య జరిగిన మొదటి సెమీఫైనల్‌లో 3-1 తేడాతో డ్రాగన్ జట్టు విజయం సాధించింది.
Also Read: మహారాష్ట్ర, జార్ఖండ్‌లలో ముగిసిన పోలింగ్..భారీగా నమోదయిన ఓటింగ్
Also Read : ఎగ్జిట్ పోల్స్.. ఝార్ఖండ్ గడ్డపై బీజేపీదే అధికారం