Beauty Tips: చర్మ అందానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. ఏం చేసిన కొన్ని రకాలు సమస్యలతోపాటు ముఖం మెరిసేలా ఉండదు. అందుకని కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్ చేసిన ట్రై చేశారంటే పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది. అయితే ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందంతోపాటు చర్మం, మెడ మీద ఉండే నొప్పులను దూరం చేస్తుంది. దీంతోపాటు ముఖం మీద పేరుకున్న మట్టి, నలుపు మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను ఏ విధంగా వాడుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం.
ఐస్ క్యూబ్స్ తాయారీ, ఉపయోగాలు
- తులసి, అలొవెరా జెల్ ముఖానికి ఎంతో మంచిది. ఓ బౌల్‌లో నీళ్లు, గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేసిన తర్వాత కొద్దిగా అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి ఆ నీటిని ఐస్‌క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు పోతాయి.
- చాలామంది స్పిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటి వారు ఐస్‌క్యూబ్స్ ట్రేలో రోజ్‌వాటర్, మంచి నీళ్లు కలపాలి ఫ్రీజర్‌లో పెట్టాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ దూరం చేస్తుంది. ఇలా చేస్తే ముఖం ఫ్రెష్‌గా ఉంటుంది.
చర్మానికి దోసకాయ ముక్కలు ఉపయోగపడుతాయి. ఓ పాత్రలో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్ వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత వీటితో ముఖంపై రబ్ చేస్తే రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గి.. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా ఉంటుంది. - చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వు, రోజ్ వాటర్ ఎంతో మేలు చేస్తుంది. కుంకుమ పువ్వును కొంచెం రోజ్ వాటర్ ఈ రెండిటినీ బాగా కలిపాక ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్, మొటిమలు, నల్లటి మచ్చలు, తగ్గి స్కిన్‌టోన్‌గా ఉంటుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: బొప్పాయి గింజల పొడితో బాక్టీరియా పరార్..ఇంకా ఎన్నో లాభాలు