Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే!

మీ రుతుచక్రం మీ మొత్తం ఆరోగ్యానికి ప్రత్యక్ష సూచిక అని గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ రుతు సైకిల్ పొడవు(26-35 రోజులు), రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉండడం, పీరియడ్స్ ఉన్న రోజుల్లో మాత్రమే రక్తస్రావం అవుతుండడం, తక్కువ నొప్పి.. ఇవన్ని ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు.

Menstrual Cycle: ఆరోగ్యకరమైన నెలసరి.. సంకేతాలు ఇవే!
New Update

నెలసరి(Periods) సమస్యలతో బాధ పడే మహిళల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నెలసరి నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. అటు కొంతమందికి టైమ్‌కి పీరియడ్స్‌ రాక ఎన్నో ఇబ్బందులకు గురవుతారు. పీరియడ్స్ మీ మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే రుతుక్రమం, భరించలేని కడుపు నొప్పి, తిమ్మిరి లాంటి లక్షణాలు చాలా మందికి ఒత్తిడిని కలిగిస్తాయి. అందుకే పీరియడ్స్‌ హెల్తీ సైకిల్‌ ఉండడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన నెలసరికి సంకేతాలు ఏంటో తెలుసుకోండి.

publive-image ప్రతీకాత్మక చిత్రం (PC: UNSPLASH)

తక్కువ నొప్పి నుంచి స్థిరమైన రుతు రక్త రంగు వరకు:
రెగ్యులర్ పీరియడ్స్‌ సైకిల్ సాధారణంగా 26-35 రోజుల మధ్య ఉండాలి. ప్రతీసారి అదే సైకిల్‌ రిపీట్ అవుతూ ఉండాలి. 5 రోజుల కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ పొడవు ఉన్న సైకిల్‌ మీ హార్మోన్లు పనిచేయడం లేదన్న విషయాన్ని సూచిస్తాయి. ఆరోగ్యకరమైన రుతుచక్రం నొప్పి లేకుండా ఉండాలి. లేదా తక్కువ నొప్పిని కలిగి ఉండాలి. కొంత అసౌకర్యం సాధారణమైనప్పటికీ, అధిక నొప్పి లేదా తిమ్మిరి అంతర్లీన సమస్యలను సూచిస్తుంది. రక్తం ఆరోగ్యకరమైన ఎరుపు రంగులో ఉంటుంది. అయితే కొన్నిసార్లు రక్తపు రంగు మారవచ్చు. కానీ సైకిల్‌ అంతటా స్థిరమైన రంగు ఉండాలి. ప్రకాశవంతమైన ఎరుపు నుంచి ముదురు గోధుమ రంగు వరకు సాధారణమైనదిగా పరిగణించవచ్చు.

ఓవులేషన్ నుంచి స్థిరమైన మూడ్ వరకు:
రెగ్యులర్ ఓవులేషన్‌ ఆరోగ్యకరమైన రుతు చక్రంలో కీలకమైన అంశం. ఇది బాగా పనిచేసే పునరుత్పత్తి వ్యవస్థను సూచిస్తుంది. ఓవులేషన్‌ తరచుగా గర్భాశయ శ్లేష్మంలో మార్పులు, శరీర ఉష్ణోగ్రతలో స్వల్ప పెరుగుదలతో సంబంధం కలిగి ఉంటుంది. రుతు చక్రం అంతటా స్థిరమైన మానసిక స్థితి ఉండాలి. అలా ఉంటే హార్మోన్ స్థాయిలు బ్యాలెన్స్‌గా ఉన్నట్లు అర్థం. హార్మోన్ల హెచ్చుతగ్గులు మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. రొమ్ము సున్నితత్వం లేదా ఉబ్బరం లాంటి తేలికపాటి ముందస్తు లక్షణాలు సాధారణం. అయినప్పటికీ, తీవ్రమైన లేదా బలహీనపరిచే లక్షణాలు హార్మోన్ల అసమతుల్యత లేదా ఇతర ఆరోగ్య సమస్యలను సూచిస్తాయని గుర్తుపెట్టుకోండి.

Also Read: కాకరకాయతో చర్మ సౌందర్యం..ఇలా వాడండి

WATCH:

#life-style #menstrual-cycle #periods-pain
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి