MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్.. విచారణ వాయిదా..! ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. By Jyoshna Sappogula 05 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి MLC Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మళ్లీ షాక్ తగిలింది. సీబీఐ కేసులో కవిత డీఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో.. కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరపు న్యాయవాది కోరారు. జడ్జ్ కావేరి భవేజా ఆగస్టు 7కు తదుపరి విచారణను వాయిదా వేశారు. Also Read: ఘోర ప్రమాదం.. ఎనిమిది మంది భక్తుల దుర్మరణం! ఈ నేపథ్యంలో ఎల్లుండి ఏం జరుగుతుందో అని బీఆర్ఎస్‌లో మళ్లీ టెన్షన్ పెరిగిపోయింది. ప్రస్తుతం కవిత తిహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, తెలంగాణ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రేపు తీహార్ జైల్లో ఉన్న కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖత్ కానున్నట్లు తెలుస్తుంది. #mlc-kavitha #delhi-liquor-scam-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి