ఎన్సీపీలో చీలికలు లేవు... అజిత్ మా పార్టీలోనే వున్నాడు... ఎన్సీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు...!

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నేతగానే కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. కొంత మంది రాజకీయంగా విభిన్నమైన స్టాండ్ తీసుకుని పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అలా అని దాన్ని చీలికగా పిలవకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

author-image
By G Ramu
ఎన్సీపీలో చీలికలు లేవు... అజిత్ మా పార్టీలోనే వున్నాడు... ఎన్సీపీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు...!
New Update

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో ఎలాంటి చీలికలు లేవన్నారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తమ పార్టీ నేతగానే కొనసాగుతారని ఆయన తేల్చి చెప్పారు. కొంత మంది రాజకీయంగా విభిన్నమైన స్టాండ్ తీసుకుని పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. అలా అని దాన్ని చీలికగా పిలవకూడదని ఆయన వ్యాఖ్యానించారు.

పుణేలోని బారామతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీలో చీలికలు వచ్చాయన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. రాజీయ పార్టీలో చీలిక అని దేన్ని అంటారని ఆయన ప్రశ్నించారు. ఓ పార్టీ నుంచి జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఓ వర్గం విడిపోతే చీలిక ఏర్పడుతుందన్నారు. కానీ తమ పార్టీలో అలాంటి పరిణామాలేవీ జరగలేదన్నారు.

కొందరు తమ పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. మరి కొందరు విభిన్న వైఖరి ఎంచుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నేతలు తమకు నచ్చిన నిర్ణయాన్ని తీసుకోవచ్చన్నారు. అంత మాత్రాన దాన్ని చీలిక అనలేమన్నారు. అజిత్ పవార్ తమ పార్టీలోనే కొనసాగుతున్నారని అన్నారు. దీనిపై ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి కన్నా మహావికాస్ అగాఢీ కూటమిలోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీలు అద్బుతమైన ప్రదర్శనను కనబరుస్తాయన్నారు. అందులో ఎలాంటి సందేహమూ లేదన్నారు. సర్వేల్లో ఎన్డీఏ కన్నా ఇండియా కూటమికి మంచి రెస్పాన్స్ వస్తోందన్న వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తాను సర్వేలను చూడలేదన్నారు.

తాము కొన్ని సర్వే కంపెనీలతో మాట్లాడుతున్నామని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కన్నా మహావికాస్ అగాఢీ ప్రభుత్వానికే ఎక్కువ స్థానాలు వస్తాయని సర్వేలు చెబుతున్నాయన్నారు. ఉల్లిగడ్డలపై ఎగుమతి పన్నును 40 శాతానికి తగ్గించాలన్నారు. ఇది చాలా సున్నితమైన విషయం అన్నారు. ఈ విషయాన్ని కేంద్రం పరిశీలించాలని ఆయన కోరారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి