Sensational Things In Gopala Peta : ఖమ్మం (Khammam) గోపాలపేట లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యోదంతం కేసును (Murder Case) తల్లాడ పోలీసులు ఛేధించారు. కన్నతల్లితో పాటు ఇద్దరు కూతుళ్లను (Mother & Two Daughters) గొంతు నులిమి చంపిన నిందితుడు పిట్టల వెంకటేశ్వర్లు సహా అతడి రెండో భార్య త్రివేణిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈనెల 17న ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణ హత్యకు గురైన పిట్టల పిచ్చమ్మ(60) పిట్టల ఝాన్సీ(6) పిట్టల నీరజ (10). కన్నతల్లి పిచ్చమ్మ సహా కన్న బిడ్డలు నీరజ, ఝాన్సీను గొంతునులిమి చంపేశాడు.
తల్లీ, కుమార్తెల పేరిట ఉన్న ఆస్తికోసమే వెంకటేశ్వర్లు ఈఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో తెలిసింది. రెండేళ్ల క్రితమే అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన పిట్టల వెంకటేశ్వర్లు మొదటి భార్య కనకదుర్గ. కనకదుర్గ చనిపోయిన తరువాత సత్తుపల్లికి చెందిన త్రివేణి అనే మహిళను వివాహం చేసుకుని వెంకటేశ్వర్లు విడిగా ఉంటున్నాడు.
కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు (Financial Issues) తలెత్తడంతో తల్లి పిచ్చమ్మ, కుమార్తెలు నీరజ, ఝాన్సీ పేరిట ఉన్న ఎకరం పొలం, ఇళ్లు, ఇంటి స్థలం విక్రయించాలంటూ భర్త వెంకటేశ్వర్లుపై త్రివేణి ఒత్తిడి తీసుకుని వచ్చింది. త్రివేణి ఒత్తిడి మేరకు ఆస్తికోసం తల్లిని పలుమార్లు భయబ్రాంతులకు గురిచేసిన కొడుకు వెంకటేశ్వర్లు ఈ వ్యవహారంపై ఊరిపెద్దమనుషులు జోక్యం చేసుకోవడంతో వెనక్కుతగ్గిన వెంకటేశ్వర్లు.
అయితే ఆర్థిక సమస్యలు తారాస్థాయికి చేరడంతో త్రివేణి ఒత్తిడి తాళలేక తల్లి సహా ఇద్దరు కుమార్తెలను చంపేయాలని నిర్ణయించుకున్న వెంకటేశ్వర్లు. ఈనెల 17న అర్దరాత్రి గోపాలపేట చేరుకుని తల్లితోపాటు ఇద్దరు కూతుళ్లను దిండుతో అదిమి గొంతు నులిమి హత్యచేసిన నిందితుడు వెంకటేశ్వర్లు.
అనంతరం తన రెండో భార్య త్రివేణి వద్దకు వెళ్లిపోయిన వెంకటేశ్వర్లు. కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు. ఈనెల19న తన రెండో భార్యతో కలిసి సత్తుపల్లి వెళుతుండగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. నిందితున్ని అతని రెండో భార్య త్రివేణి (Second Wife Triveni) ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Also read: నాలుగు రోజుల్లో పది సప్లిమెంటరీ పరీక్షలు..షెడ్యూల్ ఇదే!