Samantha in Khushi Movie:సమంత.. నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా..!

మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి సమంత ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపిస్తోంది. దీంతో సమంత, మరోసారి ఇండియాకొచ్చిందని చాలామంది పొరపడ్డారు. కానీ ఆమె తిరిగిరాలేదు. ఇండియాలో ఉన్నప్పుడే ఖుషి ప్రచారం కోసం కొన్ని ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. అవే ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి..

Samantha in Khushi Movie:సమంత.. నేను ఆడా ఉంటా.. ఈడా ఉంటా..!
New Update

Samantha in Khushi Movie:సడెన్ గా ఇంటర్వ్యూల్లో ప్రత్యక్షమైంది సమంత. దీంతో చాలామంది షాక్ అయ్యారు. ఆమె న్యూయార్క్ నుంచి తిరిగొచ్చి ఖుషి సినిమా ప్రచారంలో పాల్గొంటోందని భ్రమపడ్డారు. కానీ సమంత న్యూయార్క్ లోనే ఉంది. ఇండియాకు ఇంకా రాలేదు.

విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటించింది సమంత. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ లో గ్యాప్ తీసుకుంటానని ప్రకటించింది. మయొసైటిస్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని బౌన్స్ బ్యాక్ అవుతానని తెలిపింది. చెప్పినట్టుగానే సమంత విదేశాలకు వెళ్లింది. ఇండోనేషియాలో ప్రత్యక్షమైంది.

సమంత ట్రీట్ మెంట్ కోసమే అక్కడకు వెళ్లిందని చాలామంది అనుకున్నారు. కానీ ఆమె స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఖుషి మ్యూజికల్ ఈవెంట్ కు తిరిగి ఇండియాకు వచ్చింది. విజయ్ దేవరకొండతో కలిసి స్టేజ్ పై డాన్స్ కూడా చేసింది. ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఆమె న్యూయార్క్ వెళ్లింది.

ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండతో కలిసి ఇంటర్వ్యూలు ఇస్తూ ఆమె కనిపించింది. దీంతో సమంత, మరోసారి ఇండియాకొచ్చిందని చాలామంది పొరపడ్డారు. కానీ ఆమె తిరిగిరాలేదు. ఇండియాలో ఉన్నప్పుడే ఖుషి ప్రచారం కోసం కొన్ని ఛానెళ్లు, యూట్యూబ్ ఛానెళ్లకు ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. అవే ఇప్పుడు ప్రసారం అవుతున్నాయి.

ప్రస్తుతం సమంత అమెరికాలోనే ఉంది. న్యూయార్క్ లో జరిగిన ఇండియా పెరేడ్ లో పాల్గొంది. ఆ తర్వాత నుంచి ప్రతి రోజూ తన న్యూయార్క్ డైరీస్ కు సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు వీడియోలు ఆమె పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో సమంత ఆడా ఉంది..ఈడా ఉంది అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి