ఊహించనీ రీతిలో ప్రీ రిలీజ్ బిజినెస్..
డార్లింగ్ ప్రభాస్ హీరోగా క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సలార్' మూవీపై భారతీయ సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కూడా కేజీఎఫ్ తరహాలోనే రెండు భాగాలుగా విడుదలకానుంది. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితం రిలీజైన టీజర్లో స్పష్టంచేశారు. మొదటి భాగాన్ని ‘Ceasefire’ పేరుతో ఈ ఏడాది సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ఇప్పటికే యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎవరూ ఊహించని స్థాయిలో జరుగుతోందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.200కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ఫిల్మ్ నగర్ టాక్.
నార్త్ అమెరికాలో నయా రికార్డు..
తాజాగా మరో రికార్డును ప్రభాస్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు అమెరికాలో ఏ భారతీయ సినిమా విడుదలకాని థియేటర్స్‌లో రిలీజ్ అవ్వబోతుంది. అమెరికాలో ఒక ఇండియా మూవీ ఈ స్థాయిలో విడుదల కావడం ఫస్ట్ టైం అని ఫిల్మ్ క్రిటిక్స్ చెబుతున్నారు. నార్త్ అమెరికా మొత్తం మీద సుమారు 1979 సెంటర్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాన్నుట్లు తెలిపారు. ఇక వచ్చే నెలలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇక ఆ ట్రైలర్ రిలీజ్ అయితే ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో మరి.
ఫ్యాన్స్ కోరిక నెరవేరుస్తాయా?
బాహుబలి సిరీస్‌తో ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన సినిమాలు సాహో, రాధేశ్యామ్ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు. ఇటీవల విడుదలైన ఆదిపురుష్ మూవీ కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. దీంతో డార్లింగ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే సలార్ మూవీ వారికి బిగ్ రిలీఫ్ ఇవ్వనుందని భావిస్తున్నారు. అందులోనూ రెండు పార్టులుగా రిలీజ్ కానుండడంతో కచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అయ్యే అవకాశాలున్నాయని ఆశిస్తున్నారు. మరోవైపు సలార్‌తో పాటు ప్రాజెక్ట్ కె, మారుతి మూవీ, సందీప్ రెడ్డి వంగాతో కలిసి స్పిరిట్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమాలు అయినా సూపర్ హిట్స్ అయి డార్లింగ్ అభిమానుల కోరికను తీరుస్తాయో లేదో వేచిచూడాలి.