నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను: సాక్షి ధోని!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన ఈ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్‌ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌ లో కూడా పేరు సంపాదించుకున్నాడు.

నేను ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను: సాక్షి ధోని!
New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొన్నటి వరకు కేవలం ఇండియాకి మాత్రమే పరిమితమైన ఈ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌. పుష్ప సినిమాతో కేవలం ఇండియా వైడ్‌ మాత్రమే కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌ లో కూడా పేరు సంపాదించుకున్నాడు.

sakshi dhoni said she is a big fan of allu arjun

డేవిడ్ వార్నర్‌ వంటి క్రికెట్‌ స్టార్‌ కూడా అల్లు అర్జున్ కి పిచ్చ ఫ్యాన్. తాజాగా మిస్టర్ కూల్‌ కెప్టెన్ ధోని భార్య సాక్షి కూడా ధోనికి వీరాభిమానిని అంటూ చెప్పింది. సాక్షి కొత్తగా ధోని ఎంటర్‌టైన్మెంట్స్‌ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ముందుగా వారి ప్రొడక్షన్‌ నుంచి మొదటి ప్రాజెక్ట్ గా ఎల్‌జీఎమ్ అనే తమిళ్‌ సినిమాను తీసుకు వస్తున్నారు.

కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే మూవీ ఫేమ్ ఇవానా జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ అండ్ తెలుగులో రిలీజ్ కాబోతుంది. కొద్ది రోజుల క్రితం ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ ని చాలా గ్రాండ్ గా చేశారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో చిత్ర బృందం కలిశారు.

ఈ కార్యక్రమంలో హీరోహీరోయిన్లతో పాటు నిర్మాత సాక్షి కూడా పాల్గొంది. ఇక ఈ కార్యక్రమంలో ఒక విలేకరి సాక్షిని.. ‘మీరు తెలుగు సినిమాలు ఏవైనా చూశారా?’ అని ప్రశ్నించాడు. దానికి సాక్షి బదులిస్తూ.. “నేను అల్లు అర్జున్ సినిమాలు అన్ని చూస్తాను. ఒకప్పుడు ఓటీటీ ఉండేది కాదు. కానీ యూట్యూబ్ లో తెలుగు మూవీస్ ని డబ్ చేసి పెట్టేవాళ్ళు. అలా అల్లు అర్జున్ సినిమాలు చూడడం మొదలుపెట్టి తనకి పెద్ద ఫ్యాన్ అయ్యిపోయాను. తను సినిమా చూస్తూనే పెరిగాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని బన్నీ అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

#arjun-allu #cricket #movie #sakshi-dhoni
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి