Relationship Tips: వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే ఒకరితో ఒకరు ప్రేమగా మాట్లాడుకోవడం, తమ సమస్యలను పంచుకోవడం చాలా ముఖ్యం. కానీ చాలా సార్లు భాగస్వాముల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటాయి. ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. ఈ కారణంగా క్రమంగా వారిద్దరి మధ్య బంధం బలహీనపడుతుంది. అలాంటి పరిస్థితిలో బంధంలో అనవసరమైన చీలికలు, తగాదాలు ఏర్పడుతాయి. అయితే, దంపతుల మధ్య ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలో ఇవాళ మనం తెలుసుకుందాం..
నిన్ను పెళ్లి చేసుకుని బాధపడుతున్నా..
వివాహం గురించి విచారం వ్యక్తం చేయడం మీ భాగస్వామికి చాలా బాధాకరంగా ఉంటుంది. ఇది మీ సంబంధంలో ప్రేమను తగ్గించడమే కాకుండా నమ్మకాన్ని కూడా విచ్ఛిన్నం చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో విచారం వ్యక్తం చేసే బదులు, రాబోయే సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవడం మంచిది.
నువ్వు కూడా మీ అమ్మనాన్నల్లాగే ఉన్నావ్..
మీ భాగస్వామిని వారి తల్లిదండ్రులతో పోల్చడం మీ సంబంధానికి చెడు చేస్తుంది. ఇలా అనడం వలన మీ సంబంధంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భంలో, కోపంగా ఉన్నప్పుడు ఏదైనా అనాలనిపిస్తే.. నేరుగా ఆమె గురించి మాత్రమే అనండి. కుటుంబ సభ్యులను నిందిస్తూ అనకండి. ఇది మీ ఇద్దరి మధ్యన గ్యాప్ మరింత పెంచుతుంది.
నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు..
కొంత మంది కోపంలో నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంటారు. అయితే, పొరపాటున కూడా ఇలా అనకండి. ఇవి మీ భాగస్వామిని మనసును బాధపెడతాయి. మీ సంబంధాన్ని దెబ్బ తీస్తాయి. మీ మధ్య ఏమైనా సమస్యలుంటే.. వెంటనే కౌన్సిలింగ్ తీసుకోవడం ఉత్తమం.
వేరొకరిని పెళ్లి చేసుకున్నా బాగుండేది..
భార్యభర్తలు ఘర్షణ పెట్టుకున్న సమయంలో వేరొకరిని పెళ్లి చేసుకున్నా బాగుండేది అని అంటుంటారు. ఏమరపాటున కూడా అలా అనొద్దు. ఈ మాట మీ భాగస్వామి మనస్సును తీవ్రంగా గాయపరుస్తుంది. ఇలా కోపంలో ఏదిపడితే అది మాట్లాడే బదులుగా మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం ఉత్తమం.
సమస్యలన్నింటికీ నువ్వే కారణం..
వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలకు మీ భాగస్వామిని నిందించడం చాలా ప్రమాదకరమైనది. ఇది సమస్యను పరిష్కరించదు. బంధంలో మరింత దూరం పెంచుతుంది. ఏదైనా సమస్యను ఎదుర్కోవటానికి ఒకరినొకరు ఆదుకోవడం ముఖ్యం. ఒకరినొకరు నిందించకూడదు.
మీలో తల్లి/తండ్రి లక్షణాలే లేవు..
మీ భాగస్వామిని ఏనాడూ తల్లి/తండ్రి లక్షణాలే లేవు అని నిందించొద్దు. ఇది మీ బంధంలో బీటలు తెస్తుంది. పిల్లల పెంపకం విషయంలో భాగస్వాములు చిన్న చిన్న గొడవలు పడటం సర్వసాధారణం. అయితే, పిల్లల ముందు ఒకరికొకరు గౌరవంగా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం.
Also Read: