భారత సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి భారత ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలకు సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్‌లతో పాటు ఉన్నటువంటి ఎనిమిది సరిహద్దుల చెక్‌పోస్టు ప్రాంతాల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయింది. అలాగే అణు పరికరాలను తయారు చేసేందుకు ఈ రేడియోధార్మిక పదార్థాలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.
Also Read: టీమిండియాను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ..
మరోవైపు పాకిస్థాన్ సరిహద్దులోని సమీకృత చెక్‌పోస్టులు (ICP).. అలాగే అటారీలోని ల్యాండ్ పోర్టులు, బంగ్లాదేశ్ సరిహద్దులోని పెట్రాపోల్, అగర్తలా, డాకీ, సుతార్‌కండీ, నేపాల్ సరిహద్దులోని రాక్సువల్ జోగ్‌బానీ, మయన్మార్‌లోని మోరే పోర్టుల్లో రెడియో డిటెక్షన్ పరికరాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ పరికరాల సరఫరా, ఏర్పాటు, నిర్వహణ కోసం కేంద్రం ఇప్పటికే ఒప్పందం చేసుకుందని.. ఇందుకు సంబంధించిన ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ సరిహద్దు చెక్‌పోస్టుల్లో.. ప్రజల, వస్తువుల కదలికలను ఈ ఎనిమిది ఐసీపీల ద్వారా పర్యవేక్షించవచ్చు. అయితే ట్రక్కులతో పాటు ఇతర వస్తురవాణా మార్గాల్లో ఇలాంటి వాటిని ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రత్యేకంగా.. అలారం వ్యవస్థతో సహా అనుమానిత వస్తువుల వీడియో ఫ్రేములను రూపొందించే సామర్థ్యం కూడా వీటికి ఉంటుంది. అయితే ఈ వ్యవస్థతో పాటు అంతర్జాతీయ సరిహద్దుల నుంచి ఏవైనా రేడియోధార్మిక పదార్థాలను అక్రమంగా తరలించేందుకు ప్రయత్నాలు చేస్తే ఈ పరికరం ద్వారా అడ్డుకొవచ్చని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇలాంటి సాంకేతికత కోసం అమెరికాతో సహా మరికొన్ని దేశాల్లోని ఏజెన్సీల సహాయాన్ని తీసుకొనే పనిలో ఉంది భారత్.