ప్రభాస్ ఫ్యాన్సుకు పండగ లాంటి వార్త...“కల్కి” రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్ డార్లింగ్ ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో రాబోతోన్న మూవీ “కల్కి 2898ఎడి. వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ ఈ ఏడాది మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. By Nedunuri Srinivas 12 Jan 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Prabhas Kalki 2898 - AD: సలార్ చిత్రంతో రికార్డుల ఊచకోత కోసిన పాన్ ఇండియా స్టార్ (Prabhas) ప్రభాస్ నెక్స్ట్ సినిమా గురించి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చ నడుస్తోంది.(Nag Ashwin)నాగ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ “కల్కి 2898ఎడి”షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ ఈ మూవీలో ఓ డిఫరెంట్ రోల్ తో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రిలీజయిన ఈ మూవీ ఫస్ట్ టీజర్ సినిమాపై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలను పెంచేసింది. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్ లో చాలా ఆసక్తికరంగా చూపించారు. అప్పటినుంచి ఈ మూవీ కోసం మరింత ఆసక్తి మొదలయింది. ప్రేక్షకుల ఎదురుచూపులకు చెక్ పెట్టె క్రమంలో ఇప్పుడు ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. వైజయంతి మూవీస్ స్వర్ణోత్సవ చిత్రం కల్కి 2898ఎడి ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ స్వర్ణోత్సవ చిత్రంగా ఆయనంత భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న సినిమా కల్కి 2898ఎడి పై డార్లింగ్ ఫ్యాన్సులో చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ మూవీ ఈ ఏడాది రిలీజ్ అవుతుందా ? లేదా ? భారీ విజువల ఎఫెక్ట్స్ తో తెరకెక్కించడం మూలాన ఇప్పట్లో ఫినిష్ అయ్యేటట్లు లేదని చాలా సంశయాలు నెలకొన్నాయి. వీటన్నికి తెరదించుతూ మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మే 9 న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 6000 ఏళ్ల కితం ఏం జరిగింది? మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ తో పాటు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ పై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. కల్కి 2898ఎడి మూవీ నేపద్యాన్ని తెలియజేసేలా ఉన్న ఈ ఆసక్తికర అంశం ఈ మూవీ బ్యాక్డ్రాప్ 6000 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అనేదానిపై క్యూరియాసిటీ నెలకొంది. అంతే కాకుండా అది గతం నుంచి మళ్ళీ ఫ్యూచర్ 2898వ సంవత్సరంలోకి ఎలా లింక్ చేశారు అనేది పాయింట్ ను చాలా ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించనున్నారు.. ఇప్పటికే సింహ భాగం షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ మూవీలో( Amitabh Bachchan) అమితాబ్, కమల్ హసన్(Kamal Haasan), పసుపతి(Pasupathi) లాంటి మోస్ట్ సీనియర్ యాక్టర్స్ నటిస్తుండటంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్ కు జోడీగా (Deepika Padukone)దీపికా పదుకొనే అలరించనున్నారు. ALSO READ:Guntur Kaaram Show : థియేటర్లో ఫ్యాన్స్ తో సినిమా చూసిన మహేష్ బాబు #deepika-padhukone #kalki-2898-ad #kamal-haasan #amitabh-bachchan #nag-aswin #deepika-padukone మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి