పరువు పోయిందిగా.. ఫాలోవర్స్ లక్షల్లో.. ఓట్లు మాత్రం వందల్లో..

మహారాష్ట్ర ఎన్నికల్లో ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా వెర్సోవా స్థానం బిగ్‌బాస్ ఫేమ్ అజాజ్ ఖాన్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో నోటాకి 500 ఓట్లు రాగా.. సోషల్ మీడియాలో 5 లక్షల కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఇతనికి మాత్రం 150 ఓట్లు వచ్చాయి.

Azaz Khan
New Update

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహాయుతి విజయం దిశగా పయనిస్తోంది. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో వెర్సోవా స్థానం నుంచి నటుడు, బిగ్ బాస్ ఫేమ్ అజాజ్ ఖాన్‌ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అజాజ్ ఖాన్‌కి పెద్ద షాక్ తగిలింది. ఇతనికి సోషల్ మీడియాలో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఓట్లు మాత్రం నోటా కంటే తక్కువగా వచ్చాయి.

ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?

నోటా కంటే తక్కువ రావడంతో..

నోటాకు 500 ఓట్లు వస్తే, అజాజ్ ఖాన్‌కి మాత్రం కేవలం 150 ఓట్లు వచ్చాయి. సోషల్ మీడియా స్టార్ అయిన అజాజ్ ఖాన్‌కి నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో విమర్శలు వస్తున్నాయి. కనీసం కుటుంబ సభ్యులు కూడా అజాజ్ ఖాన్‌కి ఓట్లు వేయలేదా? అని పలువురు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:  మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?

 

ఇది కూడా చూడండి:  హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!

ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!

#bigg-boss #nota #Ajaz Khan #Aazad Samaj Party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe