ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో ఓ ఆసక్తికర ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 99 మంది ఎంపీలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిల్ దాఖలైంది. ఫతేపూర్ జిల్లాకు చెందిన భారతి దేవి అనే మహిళ ఈ ప్రజాహిత వ్యా్జ్యాన్ని దాఖలు చేశారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ.. ‘ఘర్ ఘర్ గ్యారెంటీ స్కీమ్’ను ప్రకటించిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా తమకు ఓటు వేస్తే.. ఆర్థిక ప్రయోజనాలను చేకూర్చడమే కాక ఇతర సౌకర్యాలు కల్పిస్తామని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు హామీ ఇచ్చారన్నారు.
పూర్తిగా చదవండి..Uttar Pradesh: 99 కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలి.. కోర్టులో పిల్ దాఖలు
లోక్సభ ఎన్నికల్లో గెలిచిన 99 మంది కాంగ్రెస్ ఎంపీలపై అనర్హత వేటు వేయాలని ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో ఓ మహిళ పిల్ దాఖలు చేశారు. ఎన్నికల్లో తమకు ఓటు వేస్తే ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తామని హామీ ఇచ్చారని ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు.
Translate this News: