Cars Gift to Employees: బాసు మీరు గ్రేట్...ఉద్యోగులకు వారికి నచ్చిన కార్లను గిఫ్టుగా ఇచ్చిన ఐటీ కంపెనీ ఓనర్..!!

చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ 50 మంది ఉద్యోగులకు కార్లను బహుమతిగా అందించింది. గిండి పారిశ్రామికవాడలోని ఐడియాస్ 2ఐటీ అనే కంపెనీ యజమాని మురళి తమ దగ్గర దీర్ఘకాలంగా పనిచేస్తున్న 50మందికి వారికి నచ్చిన కార్లు గిఫ్టుగా ఇచ్చింది. గతేడాది కూడా ఉద్యోగులకు ఇలానే కార్లను అందజేశారు.

Cars Gift to Employees: బాసు మీరు గ్రేట్...ఉద్యోగులకు వారికి నచ్చిన కార్లను గిఫ్టుగా ఇచ్చిన ఐటీ కంపెనీ ఓనర్..!!
New Update

గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా పేరు మీరు వినే ఉంటారు. దీపావళి రోజున తన ఉద్యోగులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడంలో ఆయన ఫేమస్. అయితే చెన్నైకి చెందిన ఓ ఐటీ కంపెనీ పేరు కూడా ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. ఈ కంపెనీ తన 50 మంది ఉద్యోగులకు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చింది. ఇది మాత్రమే కాదు, ఐడియాస్2ఐటి(Ideas2IT) టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని మురళీ వివేకానందన్ (Murali Vivekanandan)తన వద్ద దీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులతో సమావేశం అయ్యారు. తమకు కార్లను బహుమతిగా ఇస్తున్నాని చెప్పారు. అంతేకాదు తమకు ఏ కారు అంటే ఇష్టమో చీటిపై రాసివ్వాలని కోరారు. వారు రాసి ఇచ్చిన వివరాల ప్రకారం..వారికి నచ్చిన కార్లను బహుమతిగా అందించారు. అంతేకాదు తన పాత ఉద్యోగులకు కంపెనీలో 33% వాటాలను ఇస్తామని ప్రకటించారు. వివేకానందన్ తన భార్యతో కలిసి 2009లో ఈ కంపెనీని స్థాపించారు. ఈ సంస్థ ఫేస్ బుక్ ( Facebook), బ్లామ్ బెర్గ్ ( Bloomberg), మైక్రో సాఫ్ట్ ( Microsoft),  ఒరాకిల్ (Oracle), మోటారోలా (Motorola) వంటి అనేక కంపెనీలకు సేవలు అందిస్తోంది.

ఉద్యోగులకు 33 శాతం వాటాలు:

కొంతమంది ఉద్యోగులు మంచి, చెడు సమయాల్లో తనతో ఉన్నారని, వారి రుణం తీర్చుకోవాలని వివేకానందన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ, 'కంపెనీ షేర్లన్నీ నా వద్ద, నా భాగస్వాముల వద్ద ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు 33 శాతం వాటాలు ఇవ్వాలని నిర్ణయించాం. డబ్బు పంచుకునే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. దీని కింద ఉద్యోగులకు 50 కార్లు ఇస్తున్నాము. ఉద్యోగుల కష్టానికి ప్రతిఫలంగా గతేడాది కూడా కంపెనీ 100 కార్లను బహుమతిగా ఇచ్చిందని వివేకానందన్ పేర్కొన్నారు.

కంపెనీలు ఖరీదైన బహుమతులు ఇస్తున్నాయి:
ఒక ఐటీ కంపెనీ తన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్ ఐటీ కంపెనీ 13 మంది కష్టపడి పనిచేసే ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. హర్యానాలోని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీ గతేడాది దీపావళి రోజున తమ ఉద్యోగులకు టాటా పంచ్ కారును బహుమతిగా ఇచ్చింది. అదేవిధంగా చెన్నై సంస్థ చలానీ జ్యువెలరీ మార్ట్ యజమాని జయంతి లాల్ ఛాయంత్ తన ఉద్యోగులకు బహుమతులు ఇచ్చేందుకు రూ.1.2 కోట్లు ఖర్చు చేశారు. పది మంది ఉద్యోగులకు కార్లు, 20 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు.

ఇది కూడా చదవండి: రామమందిరం నిర్మించిన ఎల్‌అండ్‌టీ కంపెనీ షేర్లలో భారీ ర్యాలీ.. ఇప్పటి వరకూ ఎంత లాభం వచ్చిందంటే..?

#murali-vivekanandan #cars-gift-to-employees #ideas2it
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి