TTDP First list: స్పీడ్ పెంచుతున్న ప్రతిపక్షాలు.. త్వరలోనే టీ టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!

తెలంగాణ రేస్ లో తాము ఉన్నామని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు కూడా 36 మందితో ఈ నెల 23 ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక జాబితాను ఫైనల్ చేసే విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసానితో పాటు ఇంకా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అయితే తెలంగాణలో పార్టీ ఉండడం చారిత్రాత్మక అవసరమని.. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు..

TTDP First list: స్పీడ్ పెంచుతున్న ప్రతిపక్షాలు.. త్వరలోనే టీ టీడీపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్..!
New Update

TTDP First list:  తెలంగాణలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. అధికార పక్షం ఏకంగా 115 స్థానాల్లో బరిలోకి దింపుతున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేయడం తో షాక్ తిన్న ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థుల లిస్ట్ ను సాధ్యమైనంత త్వరలో విడుదల చేయడానికి కసరత్తు మొదలు పెట్టారు. దీంతో ఏ క్షణంలో అయినా.. ప్రధాన ప్రతిక్షాలైన బీజేపీ, కాంగ్రెస్ లు కూడా ఫస్ట్ లిస్ట్ ను విడుదల చేయవచ్చు. అయితే బీఆర్ఎస్ తమ అభ్యర్థులను వెల్లడించడంతో.. దాన్ని బట్టి బరిలోకి దింపాల్సిన వాళ్ల పై మరోసారి ప్రతిపక్షాలు మరింత కసరత్తు చేసి లిస్ట్ ఫైనల్ చేసే పనిలో పడ్డాయి.

త్వరలోనే టీటీడీపీ ఫస్ట్ లిస్ట్..!

ఇక తెలంగాణ రేస్ లో తాము ఉన్నామని చెబుతున్న తెలుగు తమ్ముళ్లు కూడా 36 మందితో ఈ నెల 23 ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక జాబితాను ఫైనల్ చేసే విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసానితో పాటు ఇంకా ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. అయితే తెలంగాణలో పార్టీ ఉండడం చారిత్రాత్మక అవసరమని.. కాబట్టి అభ్యర్థులు తప్పకుండా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో టీడీపీ నిర్వహించనున్న బస్సుయాత్ర, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై కాసాని బాబుకు వివరించారు.

ఈ సారి బరిలోకి ఒంటరిగానే..!

అయితే గత ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈ సారి ఏ పార్టీతో పొత్తులు లేవని ఒంటరిగానే టీడీపీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే తెలంగాణలో కలిసి పోటీ చేసే పరిస్థితి లేదని.. కాబట్టి ఒంటరిగానే బరిలోకి దిగేందుకు అభ్యర్థులు సిద్దపడాలన్నారు. తెలంగాణలో టీడీపీకి మంచి ఆదరణ ఉందని.. దాన్ని ఓటు బ్యాంక్ గా మార్చుకోవాలని ఆయన పార్టీ శ్రేణులను సూచించారు. ఇక 119 స్థానాల్లోను పోటీ చేయాలన్నారు. తెలంగాణ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. విజన్ 2020 ద్వారా తెలంగాణను డెవలప్ చేశామని.. నేడు విజన్ 2047 తో ముందుకు సాగుతున్నామన్నారు బాబు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి