SmartWatch: ఎల్లుండే వన్‎ప్లస్ వాచ్ 2 లాంఛ్ ..రూ.99కే బుకింగ్..పూర్తివివరాలివే..!

ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ వన్‎ప్లస్ మరో సరికొత్త స్మార్ట్‎వాచ్ ను భారత మార్కెట్లో లాంఛ్ చేసేందుకు రెడీ అవుతోంది. వన్‎ప్లస్ స్మార్ట్‎వాచ్ 2 పేరుతో దీనిని తీసుకువస్తుంది. కేవలం రూ. 99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్‎సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపింది.

SmartWatch: ఎల్లుండే వన్‎ప్లస్ వాచ్ 2 లాంఛ్ ..రూ.99కే బుకింగ్..పూర్తివివరాలివే..!
New Update

SmartWatch:  వన్ ప్లస్ కు భారత మార్కెట్లో ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రముఖ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ తయారుదారీ సంస్థ నుంచి మార్కెట్లోకి ఏ ప్రొడక్టు విడుదలైనా హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. అంటే వన్ ప్లస్ బ్రాండ్ కు ఉన్న క్రేజ్ ఏంటో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థ నుంచి మరో మూడు రోజుల్లో ఓ సరికొత్త ప్రొడక్టు మార్కెట్లోకి విడుదల కానుంది. అదే వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ 2. దీని ఫీచర్లు, స్పెక్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఫీచర్లు:
- వాచ్​ స్క్రీన్​- 1.43 అంగుళాలు
- డిస్​ప్లే సైజ్​- 46ఎంఎం
- డిస్​ప్లే మెటీరియల్​- సఫైర్​ క్రిస్టల్​ ఆల్మోడ్ డిస్‌ప్లే
- ప్రాసెసర్​- క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ W5 Gen 1 చిప్​సెట్​
- బ్యాటరీ లైఫ్​- 100 గంటలు
- కలర్స్​- రేడియంట్​ స్టీల్, బ్లాక్​ స్టీల్
- బ్యాటరీ సామర్థ్యం- 402ఎంఏహెచ్
- వాటర్​ రెసిస్టెంట్​- IP68 రేటింగ్​
- ఓఎస్​- గూగుల్ WearOS 4.0
- ధర- రూ.16,999 (అంచనా మాత్రమే)
- విడుదల అంచనా తేదీ- 2024 ఫిబ్రవరి 26

ప్రీ బుకింగ్స్:
వన్ ప్లస్ లాంచ్ చేయనున్న ఈ వన్ ప్లస్ స్మార్ట్ వాచ్ 2 కు సంబంధించి ప్రీ బుకింగ్స్ ఇప్పటికే షురూ అయ్యాయి. కేవలం రూ. 99లను చెల్లించి సంస్థ అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వన్ ప్లస్ స్టోర్ లతోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఇ కామర్స్ ఆన్ లైన్ స్టోర్స్ లో కూడా ఈ వాచ్ ను బుక్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ, 6 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీఎం రేవంత్

#oneplus-smartwatch-2 #oneplus-watch-2-features #oneplus-watch-2-specs #oneplus-watch-2-launch-date #technews
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి