SmartPhone: రూ.14వేలలోపే బ్రాండెడ్ ఫోన్ కావాలా?అయితే వన్ ప్లస్ 5జీఫోన్ బెటర్ ఆప్షన్..!!

వన్ ప్లస్ తన చవకైన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర భారతీయ కరెన్సీలో రూ. 14వేల లోపు మాత్రమే. గతంలో విడుదల అయిన వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈకి తర్వాతి వెర్షన్ గా ఈ ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

New Update
SmartPhone: రూ.14వేలలోపే బ్రాండెడ్ ఫోన్ కావాలా?అయితే వన్ ప్లస్ 5జీఫోన్ బెటర్ ఆప్షన్..!!

OnePlus Nord N30 SE:  వన్ ప్లస్  చౌకైన స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ పేరు వన్ ప్లస్ నార్డ్ ఎన్ 30 ఎస్ఈ , దీనిని కంపెనీ బడ్జెట్ శ్రేణిలో విడుదల చేసింది. వన్ ప్లస్ (OnePlus) ఈ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ ఎన్20ఎస్ఈ ( OnePlus Nord N20 SE)తర్వాతి అప్‌గ్రేడ్ వెర్షన్ గా మార్కెట్లోకి తీసుకువచ్చింది. కొత్తగా మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటి 6020 ప్రాసెసర్ ను అందించారు. దీని బ్యాటరీ కెపాసిటీ 5000ఎంఏహెచ్ ఉంది. 33వాట్సా వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేయనుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ సైడ్ భాగంలో అందించారు.

OnePlus Nord N30 SE OnePlus Nord N30 SE

ఫోన్ బ్యాక్ సైడ్ 50మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ను అందించారు. ర్యామ్ ఆప్షన్ ,రెండు కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్‌లో కనెక్టివిటీ కోసం, కంపెనీ 5జీ, GPS, NFC, బ్లూటూత్ 5.3 , USB టైప్-సి వంటి అనేక ఫీచర్లను అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఆక్సిజన్ OSలో పనిచేస్తుంది.కాగా ఈ ఫోన్ లో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌సిడి డిస్‌ప్లేను కలిగి ఉంది.

OnePlus Nord N30 SE

ధర :
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీతో వచ్చిన ఈ వేరియంట్ ధరను 599 దిరమ్స్ అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 13,600గా నిర్ణయించారు. ఈ మోడల్ ఇప్పటికే వన్ ప్లస్ గ్లోబల్ వెబ్ సైట్లో లిస్ట్ అయ్యి ఉంది. శాటిన్ బ్లాక్, సియాన్ స్పార్కిల్ కలర్ ఆప్షన్స్ లో దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

ఇది కూడా చదవండి: ఒకరోజు జ్యుడీషియల్ కస్టడీకి హేమంత్ సోరెన్‌..రిమాండ్ పై నిర్ణయం ఎప్పుడంటే..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు