ఇన్నాళ్లకు ఇన్ స్టాలో ఆదిపురుష్ దర్శకుడు..రెచ్చిపోయిన నెటిజెన్స్..!

‘ఆదిపురుష్’ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ హీరో ప్రభాస్ ని రాముడిగా ట్రై చేసిన సినిమా. ప్రేక్షకుల్లో రాముడి మీదున్న అపార భక్తి రామాయణం మీద ఉన్న గౌరవం వెరసి ఈ చిత్రాన్నిభారీ నష్టాన్ని చవిచూసింది. దీంతో దర్శకుడు ఓం రౌత్ నెల రోజులుగా అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు.

ఇన్నాళ్లకు ఇన్ స్టాలో ఆదిపురుష్ దర్శకుడు..రెచ్చిపోయిన నెటిజెన్స్..!
New Update

‘ఆదిపురుష్’ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ హీరో ప్రభాస్ ని రాముడిగా ట్రై చేసిన సినిమా. ప్రేక్షకుల్లో రాముడి మీదున్న అపార భక్తి రామాయణం మీద ఉన్న గౌరవం వెరసి ఈ చిత్రాన్నిభారీ నష్టాన్ని చవిచూసింది. దీంతో దర్శకుడు ఓం రౌత్ నెల రోజులుగా అజ్ఞాతం లోకి వెళ్లిపోయాడు.

publive-image

మళ్లీ ఇన్నాళ్లకు ఇన్ స్టా గ్రామ్ లో అప్ డేట్ పెట్టి ఆశ్చర్య పరిచాడు. దీంతో నెటిజెన్లు ఓం రౌత్ ను ట్రోల్స్ తో ఆడుకున్నారు. ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతపాత్రను పోషించింది. ఈ సినిమా జూన్ 16న భారీ అంచనాల మధ్య విడుదలై ఎన్నో వివాదాలను ఎదుర్కొంది.

ఆదిపురుష్ సినిమా దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ కి కారణం డైరెక్షన్ ఫాల్టని అందరికీ అర్థమయ్యింది.

ఓం రౌత్ దర్శకత్వం ప్రీ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడికి ఒక సీటు ఉంచమనడం తప్ప సినిమాలో మాత్రం కనపడలేదని జనం తేల్చేశారు. దీంతో డైరెక్టర్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల వేదికగా అతను కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. అయితే ఎన్ని విమర్శలు ఎదురైనా ఓం రౌత్ మాత్రం స్పందించలేదు.

సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత తాజాగా, ఓం రౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేశాడు. ‘‘ శ్రీ మాంగేశి, శ్రీ శాంతదుర్గ దేవాలయాలను దర్శనం చేసుకున్నా.ఇక్కడికి వచ్చిన తరచుగా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటా.

ఈ రెండు పవిత్ర స్థలాలు నన్ను నా మూలాలకు కనెక్ట్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకుని దీవెనలు పొందాలని నేను ఎల్లప్పుడూ ఉత్సాహంతో ఉంటా’’ అంటూ రాసుకొచ్చారు.

దీంతో అది చూసిన నెటిజన్లు రూ. 600 కోట్లను ఆగం చేశావు.. అన్నా నువ్వు ఇంకా బతికే ఉన్నావా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొంత మంది దయచేసి మీరు దేవుళ్లకు సంబంధించిన సినిమాలు తీయవద్దని సలహా ఇస్తున్నారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి