Railway Recruitment 2024: నిరుద్యోగులకు శుభవార్త. నైపుణ్యాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. వివిధ కోర్సులు చదవినవారికి కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అందించే విధంగా ప్రోత్సహిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇండియన్ రైల్వేస్(Indian Railways) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా జైపూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (Railway Recruitment Cell, Jaipur), మొత్తం 1646 ఖాళీలతో కూడిన అప్రెంటిస్‌షిప్ పొజిషన్(Apprenticeship Position)ల రిక్రూట్‌మెంట్ చేపట్టింది. జనవరి 2, 2024న విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్‌లో రిక్రూట్ మెంట్ గురించి పూర్తి వివరాలను వెల్లడించింది. జనవరి 10, 2024 నుండి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఆసక్తితోపాటు అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rrcjaipur.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రైల్వే సెక్టార్ లో ఉద్యోగం పొందాలనుకునేవారికి ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు దశలు, మరిన్నింటితో సహా రిక్రూట్‌మెంట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు :
1646 పోస్టులు వివిధ వర్క్‌షాప్‌లలో ఈ క్రింది విధంగా ఉన్నాయి:
DRM ఆఫీస్, అజ్మీర్: 402
DRM ఆఫీస్, బికనీర్: 424
DRM ఆఫీస్, జైపూర్: 488
DRM ఆఫీస్, జోధ్‌పూర్: 67
BTC క్యారేజ్, అజ్మీర్: 113
BTC LOCO, అజ్మీర్: 56
క్యారేజ్ వర్క్‌షాప్, బికనీర్: 29
క్యారేజ్ వర్క్‌షాప్, జోధ్‌పూర్: 67
దరఖాస్తు రుసుము:
అభ్యర్థులందరికీ: రూ. 100. చెల్లించాలి
SC/ST కోసం, బెంచ్‌మార్క్ వికలాంగులు (PwBD), మహిళలు ఎలాంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.
వయస్సు:
అభ్యర్థులు 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి, ప్రత్యేక వర్గాలకు చెందిన అభ్యర్థులకు వయో సడలింపు అందించబడింది.
విద్యార్హతలు:
ఆసక్తి గల అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50శాతం మార్కులతో 10వ తరగతి లేదా దానికి సమానమైన పాసై ఉండాలి. అదనంగా, వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ లేదా స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
-అధికారిక రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ www.rrcjaipur.inని లాగిన్ అవ్వండి.
-హోమ్‌పేజీలో అప్రెంటిస్‌షిప్ పోస్ట్‌ల కోసం ప్రచురించిన నోటీసును సెలక్ట్ చేసుకోండి.
- దరఖాస్తు ఫారమ్‌ను జాగ్రత్తగా పూరించడానికి అందించిన సూచనలను చదవండి.దరఖాస్తును సమర్పించిన తర్వాత ఒక ప్రత్యేక నెంబర్ ను క్రియేట్ చేసుకోండి.
-అవసరమైన రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించండి.
-భవిష్యత్ సూచన కోసం పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ చేయండి.