New Mobiles: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌కి కౌంట్‌డౌన్‌..రిలీజ్‌ ఎప్పుడంటే..?

నథింగ్‌ ఫోన్‌ (2) ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ కొత్త 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 44,999గా ఉండనుంది. యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి సరికొత్త నథింగ్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేలు డిస్కౌంట్ ఆఫర్ అందించనుంది. దాంతో ఈ కొత్త నథింగ్ ఫోన్ ప్రభావవంతంగా ధరను రూ.41,999కి తగ్గిస్తుంది.

New Mobiles: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్‌కి కౌంట్‌డౌన్‌..రిలీజ్‌ ఎప్పుడంటే..?
New Update

స్మార్ట్‌ఫోన్‌ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న నథింగ్‌ ఫోన్‌ (2) ఎట్టకేలకు భారత మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. అతిత్వరలో ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఆకర్షణీయమైన డిజైన్‌, ఫీచర్లతో కూడిన తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను గతేడాది మార్కెట్‌లోకి విడుదల చేసిన నథింగ్‌ కంపెనీ.. తాజాగా తన మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ (2) ఫస్ట్ సేల్ జూలై 21న ప్రారంభం కానుంది. ఈ కొత్త 5G ఫోన్ ప్రారంభ ధర రూ. 44,999గా ఉండనుంది. అయితే, ఆసక్తిగల వినియోగదారులు యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి సరికొత్త నథింగ్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ బ్యాంక్ కార్డ్‌లపై రూ.3వేలు డిస్కౌంట్ ఆఫర్ అందించనుంది. దాంతో ఈ కొత్త నథింగ్ ఫోన్ ప్రభావవంతంగా ధరను రూ.41,999కి తగ్గిస్తుంది.

publive-image నథింగ్‌ ఫోన్‌ (2)

ఆండ్రాయిడ్ 13 ఆధారిత నథింగ్ ఓఎస్‌ 2.0తో నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌ పనిచేస్తుంది. ఇందులో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఎల్‌టీపీవో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. నథింగ్ ఫోన్ 2 క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలు (వెనుక రెండు, ముందు ఒక కెమెరా) ఉన్నాయి. వెనుక వైపు రెండు 50 ఎంపీ కెమెరాలు, ముందు భాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. మూడు హై-డెఫినిషన్‌ మైక్రోఫోన్‌లు, రెండు స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. నథింగ్ ఫోన్ 2 స్మార్ట్‌ఫోన్‌లో 4,700 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 45 వాట్ పీపీఎస్‌ వైర్డ్‌, 15 వాట్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వైర్డ్‌ ఛార్జింగ్‌లో 55 నిమిషాల్లో, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌లో 130 నిమిషాల్లో ఈ ఫోన్‌ బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుందని నథింగ్ కంపెనీ పేర్కొంది. ఇక ఈ ఫోన్‌కు రెండు వైపులా గొరిల్లా గ్లాస్‌ ఉండనుంది.

నథింగ్ ఫోన్ (2) హుడ్ కింద ఫ్లాగ్‌షిప్-గ్రేడ్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గత ఏడాదిలో స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoCని ఉపయోగిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా ఖరీదైన ఫోన్‌లు వేగంగా శక్తిని అందిస్తున్నాయి. మీరు ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను, వెనుకవైపు కూల్ గ్లిఫ్ బ్యాక్‌లైట్ ఇంటర్‌ఫేస్‌ను పొందవచ్చు. నోటిఫికేషన్‌ల వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్ ఫంక్షన్‌లకు లెడ్ లైట్లు, నిర్దిష్ట సౌండ్‌ని సెట్ చేయవచ్చు. కొంచెం బాక్సీ డిజైన్‌ కొంచెం తేలికగా ఉంటుంది. సూర్యకాంతిలో స్క్రీన్ చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. కలర్లు కూడా ఆకట్టకునేలా ఉంటాయి. నథింగ్ ఫోన్ (2)లో LTPO ప్యానెల్ ఉంది. రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్‌గా 10Hz, 120Hz మధ్య అడ్జెస్ట్ చేసుకోవచ్చు. నథింగ్ ఫోన్ ప్లస్ పాయింట్లలో ఒకటి. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ IP54 రేటింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ డివైజ్ 6.7-అంగుళాల HDR 10+ డిస్ప్లేను కలిగి ఉంది. లైటింగ్ పరిస్థితుల్లో ప్రైమరీ కెమెరా షార్ప్‌నెస్, బెటర్ క్వాలిటీ గల ఫొటోలను అందిస్తుంది. డైనమిక్ పరిధి చాలా బాగుంది. అయినప్పటికీ, అల్ట్రావైడ్ కెమెరాలో ఫొటో క్వాలిటీ కొద్దిగా తగ్గుతుంది. పోర్ట్రెయిట్ షాట్‌లు ఆకట్టుకునేలా ఉంటాయి. మెరుగైన కెమెరా కోసం వినియోగదారులు Pixel 7aని కొనుగోలు చేయొచ్చు. 5G ఫోన్‌లో లాంగ్ లైఫ్ సాఫ్ట్‌వేర్ సపోర్టు అందిస్తుంది.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe