E-Luna Moped: సరికొత్తగా లూనా మోపెడ్ మళ్ళీ వచ్చేసింది..స్పెషాలిటీస్ ఇవే.. 

అప్పట్లో మార్కెట్లో ఒక వెలుగు వెలిగిన లూనా మోపెడ్ ఇప్పుడు సరికొత్త ఎలక్ట్రిక్ మోపెడ్ గా అందుబాటులోకి వచ్చింది. ఇది రూ. 69,990 (ఎక్స్-షోరూమ్)ల ధరతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లో అందుబాటులో ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 110 కిలోమీటర్ల బ్యాటరీ రేంజ్ దీనికి ఉంది. 

New Update
E-Luna Moped: సరికొత్తగా లూనా మోపెడ్ మళ్ళీ వచ్చేసింది..స్పెషాలిటీస్ ఇవే.. 

E-Luna Moped: కైనెటిక్ గ్రీన్ ఈ-లూనాను ప్రారంభించింది. ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా కంపెనీ ఈ ఎలక్ట్రిక్ మోపెడ్‌ను విక్రయిస్తోంది. కంపెనీ తన బుకింగ్‌ను జనవరి 26, 2024 నుండి ప్రారంభించింది. 500 రూపాయల టోకెన్‌తో దీనిని బుక్ చేసుకోవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 69,990 (ఎక్స్-షోరూమ్).

ఇ-లూనా(E-Luna Moped) ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోడ్డు రవాణా- రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, 'నేను కూడా కాలేజీ  రోజుల్లో లూనాను ఉపయోగించాను. అప్పట్లో లూనా పెట్రోలుతో నడిచేది, అప్పట్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 40, కాబట్టి ఖర్చును లెక్కించి సగటున 30 నుండి 40 పైసలు ఖర్చు  అయ్యేది అని ఉచెప్పారు. 

ఇప్పుడు ఈ ఇ-లూనా(v), దీని ధర కిలోమీటరుకు 10 పైసలు. అంటే 100 కిలోమీటర్లకు రూ.10 ఖర్చుతో నడుస్తుంది. రూ.20 నుంచి 25 వేల జీతం ఉన్న పేదలు, సర్వీస్ సెక్టార్  ప్రజలకు ఇదో వరం అని చెప్పవచ్చు. ద్విచక్ర వాహన మార్కెట్‌లో దీనికి మంచి స్పందన వస్తుందని  భావిస్తున్నారు. 

Also Read: అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!

50 kmph టాప్ స్పీడ్
ఇ-లూనా(E-Luna Moped) ఐదు రంగులలో లభిస్తుంది - మల్బరీ రెడ్, ఓషన్ బ్లూ, పెర్ల్ ఎల్లో, స్పార్క్లింగ్ గ్రీన్, నైట్ స్టార్ బ్లాక్. కంపెనీ ఇందులో 2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. దీని బ్యాటరీ మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇందులో 2 వాట్ల మోటారు ఉంటుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 110 కి.మీల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో, దీని గరిష్ట వేగం గంటకు 50 కిలోమీటర్లు. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్‌పై కంపెనీ 5 సంవత్సరాల వారంటీని ఇస్తోంది.

4 గంటల్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

ఈ వాహనంతో పాటు పోర్టబుల్ ఛార్జర్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్‌(E-Luna Moped)ను 4 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. దీనికి USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. భద్రత కోసం, దీనికి రెండు చివర్లలో కాంబి డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ మోపెడ్ మొత్తం బరువు 96 కిలోలు.

ఇ-లూనా పొడవు 1.985 మీ, వెడల్పు 0.735 మీ, ఎత్తు 1.036 మీ అలాగే వీల్‌బేస్ 1335 మిమీ. దీని సీటు ఎత్తు 760 మిమీ. అదే సమయంలో, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ గా ఉంది. స్తూడెంట్స్, మహిళలకు ఇది చాలా చక్కని వాహనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. 

Watch this Interesting News :

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు